- ఆందోల్ నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా భావోద్వేగానికి గురైన బాబుమోహన్
- తమ కుటుంబాన్ని విడదీసి హరీశ్ రావు తన కొడుకుని పార్టీలో చేర్చుకున్నారని ఆవేదన
- ఐదు రోజుల క్రితం బీఆర్ఎస్‌లో చేరిన ఉదయ్ బాబుమోహన్
ఆందోల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న బాబుమోహన్ శుక్రవారం కంటతడి పెట్టారు. ఈ నెల 30న పోలింగ్ ఉంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఆయన జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రోజు కూడా ప్రచారం నిర్వహిస్తోన్న క్రమంలో ఒక్కసారిగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నికలకు కొన్నిరోజుల ముందు తన కొడుకును అధికార బీఆర్ఎస్ తమ పార్టీలో చేర్చుకోవడంతో ఆయన కంటతడి పెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీఆర్ఎస్ తండ్రీకొడుకులను విడదీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి హరీశ్ రావు తన కుటుంబాన్ని విడదీసి… తన కొడుకు మెడలో బీఆర్ఎస్ కండువా కప్పి ఆనందిస్తున్నారని విమర్శించారు. కాగా బాబుమోహన్ తనయుడు ఉదయ్ బాబుమోహన్ ఐదు రోజుల క్రితం హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: