Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

కేసీఆర్ గొప్ప పాలనాదక్షులు: ఎంపీ రవిచంద్ర

కేసీఆర్ గొప్ప పాలనాదక్షులు: ఎంపీ రవిచంద్ర
రాష్ట్రాన్ని సాధించడమే కాక దేశం మొత్తం మీద అగ్రగ్రామిగా తీర్చిదిద్దారు: ఎంపీ రవిచంద్ర
బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది: ఎంపీ
సాంబశివరావు,వెంకట్రావులు కుమ్మక్కై కుట్ర రాజకీయాలు చేస్తున్నారు: ఎంపీ రవిచంద్ర
వనమా అందరికి అందుబాటులో ఉండే ప్రజా నాయకులు: ఎంపీ రవిచంద్ర
వనమాను గెలిపిద్దాం, కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎంను చేద్దాం:ఎంపీ రవిచంద్ర
ఎంపీ రవిచంద్ర సమక్షంలో సీపీఐ, బీఎస్పీ, కాంగ్రెస్,జలగంకు చెందిన వందలాది మంది బీఆర్ఎస్ లో చేరిక

కొత్తగూడెం తెలంగాణ భవన్ లో శనివారం సాయంత్రం జరిగిన చేరిక కార్యక్రమంలో నినాదాలతో దద్దరిల్లిన పరిసరాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ మహానేత, గొప్ప పాలనాదక్షులు అని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు.పోరాడి రాష్ట్రాన్ని సాధించడమే కాక దేశం మొత్తం మీద అగ్రగ్రామిగా తీర్చిదిద్దారని, ప్రగతిపథాన పరుగులు పెట్టిస్తున్నారని వివరించారు.తెలంగాణ రాష్ట్రం,అన్ని వర్గాల ప్రజల బాగోగుల గురించి ప్రతినిత్యం ఆలోచించే, కృషిసల్పే బీఆర్ఎస్ ను, కేసీఆర్ గారిని కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరిపై ఉందని ఎంపీ రవిచంద్ర చెప్పారు.కొత్తగూడెం తెలంగాణ భవన్ లో శనివారం సాయంత్రం సీపీఐ, బీఎస్పీ, కాంగ్రెస్,జలగం వర్గానికి చెందిన వందలాది మంది ఎంపీ వద్దిరాజు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీపీఐ అభ్యర్థి సాంబశివరావు, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేస్తున్న వెంకట్రావులు కుమ్మక్కై కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.సాంబశివరావు తన వ్యక్తిగత స్వార్థం కోసం సీటు సంపాదించుకుని ఎంతో ఘనచరిత్ర కలిగిన సీపీఐ ప్రతిష్ఠను మంటకలిపారని దుయ్యబట్టారు.సింహం గుర్తు కోసం కోలకత పార్టీ అయిన ఫార్వర్డ్ బ్లాక్ నుంచి టిక్కెట్ తెచ్చుకున్న వెంకట్రావు ఏనాడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండరన్నారు.రాష్ట్రంలో సీనియర్ శాసనసభ్యుడైన, కొత్తగూడెం అభివృద్ధి ప్రధాత వనమా వెంకటేశ్వరరావును ఓడించేందుకు సాంబశివరావు, వెంకట్రావులు ఒక్కటై కుయుక్తులు పన్నుతుండడం తీవ్ర అభ్యంతరకరమన్నారు.ఎవరెన్ని కుట్రలు చేసినా మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుతూ వనమాను భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించుకుందామని, కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎంను చేద్దామని ఎంపీ వద్దిరాజు చెప్పారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర బీఎస్పీ నాయకురాలు వీణా సెబాస్టియన్,ఆమె అనుచరులు 200మందికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించారు.కొత్తగూడెం పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు పులి మోహన్ రావు నాయకత్వంలో ఆ కులస్తులంతా బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.అలాగే, లక్ష్మీదేవిపల్లి మండలం గడ్డిగుట్ట గ్రామానికి చెందిన సీపీఐ కుటుంబాలు ఎంపీ రవిచంద్ర సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.రజక సంఘం ప్రముఖులు సత్యవతి, లక్ష్మీనారాయణ,యూత్ లీడర్ వెంకటేష్,పాల్వంచ నివాసి పాషా, చంద్రకుమార్, గణేష్ బస్తీకి చెందిన భువనేష్,ఎం.మోజెస్ తదితరులకు ఎంపీ వద్దిరాజు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.అదేవిధంగా గడ్డిగుట్ట గ్రామ సర్పంచ్ రవికుమార్ ఆధ్వర్యంలో Ward Members భట్టు లలిత,భూక్యా సక్కులు,మాలోతు లక్ష్మీ,సేవాలాల్ సేన ప్రముఖులు భట్టు హుస్సేన్ తదితరులు గులాబీ కండువాలు కప్పుకున్నారు.బీఆర్ఎస్ నాయకులు భీమా శ్రీధర్ ఆధ్వర్యంలో వాగబోయిన రాము,శ్రీరాములు,దుబాస్, సుధాకర్, శ్రీనివాస్ తదితరులు జలగంకు గుడ్ బై చెప్పి ఎంపీ రవిచంద్ర సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రముఖులు ఎడవల్లి కృష్ణ,భూక్యా చందూనాయక్,ఎడవల్లి నవీన్,మోరె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా “జై తెలంగాణ జై జై తెలంగాణ”,” వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి”,” జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”,” కారు గుర్తుకే మన ఓటు”అనే నినాదాలతో తెలంగాణ భవన్, దాని పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి.

Related posts

డీప్‌ఫేక్‌ ఆడియోల ద్వారా తనపై అసత్య ప్రచారం… మండిపడ్డ మాజీమంత్రి అజయ్

Ram Narayana

ఖమ్మం బీఆర్ యస్ కకావికలం …కాంగ్రెస్ కు జైకొట్టిన మేయర్ నీరజ…

Ram Narayana

ఖమ్మంలో రౌడీ రాజ్ ..మంత్రి మనుషుల దౌర్జన్యాలు …మాజీమంత్రి ఫైర్…

Ram Narayana

Leave a Comment