- గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి బరిలోకి దిగిన కేసీఆర్
- కొడంగల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి
- బీజేపీ నుంచి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి గెలిచే అవకాశముందన్న ఆరా మస్తాన్ సర్వే
తెలంగాణలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉన్నాయి. అయితే అందరి చూపు కామారెడ్డిపై ఉంది. ఇక్కడ స్వయంగా బీఆర్ఎస్ నుంచి ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బరిలో నిలిచారు. ఇలాంటి చోట బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. ఈ మేరకు ఆరా మస్తాన్ సర్వే ప్రకారం… కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఇక్కడ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని ఆరా మస్తాన్ సర్వే వెల్లడించింది. మరోవైపు గజ్వేల్‌లో కేసీఆర్ స్వల్ప మెజార్టీతో గెలుస్తారని ఆరా మస్తాన్ సర్వే పేర్కొంది.