- ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసిన పలువురు నేతలు
- ఎగ్జిట్ పోల్స్ తో పరేషాన్ కావద్దన్న కేసీఆర్
- 3వ తేదీన సంబరాలు చేసుకుందామని వ్యాఖ్య
ఈ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ గురించి పరేషాన్ కావద్దని చెప్పారు. ఫలితాలపై జరుగుతున్న ప్రచారంతో ఆందోళన చెందవద్దని, తెలంగాణను మళ్లీ పాలించబోయేది బీఆర్ఎస్సేనని అన్నారు. 3వ తేదీన సంబరాలు చేసుకుందామని చెప్పారు. పలువురు నేతలు ఈరోజు ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 3వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మంత్రి కేటీఆర్ సైతం బీఆర్ఎస్ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, పలు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడం గమనార్హం.
డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ భేటీ: ముఖ్యమంత్రి కార్యాలయం
- 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ
- సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం
- డిసెంబర్ 3న వెలువడనున్న ఎన్నికల ఫలితాలు
డిసెంబర్ 4వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగబోతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది.
మరోవైపు 3వ తేదీన తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాలపై మంత్రి కేటీఆర్ పూర్తి ధీమా వ్యక్తం చేశారు. 70 సీట్లకు పైగా బీఆర్ఎస్ గెలుచుకుంటుందని ఆయన చెప్పారు.