తెలంగాణ వార్తలు

చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయా: కేటీఆర్

  • నిన్నటితో ముగిసిన పోలింగ్ ప్రక్రియ
  • బీఆర్ఎస్ గెలుపుపై ధీమాగా ఉన్న కేటీఆర్
  • ఎగ్జాక్ట్ పోల్స్ మనకు శుభవార్తను చెపుతాయని ట్వీట్
I slept well after many days says KTR

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిన్న ముగిసింది. ఈవీఎంలు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. ఆదివారం నాడు (3వ తేదీ) కౌంటింగ్ జరగనుంది. ఏ పార్టీ గెలుస్తుందో అనేది నేతలను, ప్రజలను టెన్షన్ కు గురిచేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ గెలుపుపై మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆయన అంటున్నారు. తాజాగా ఆయన ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. చాలా రోజుల తర్వాత తాను ప్రశాంతంగా నిద్రపోయానని ఆయన చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ లో అతిశయోక్తులు ఉంటాయని… ఎగ్జాక్ట్ పోల్స్ (అసలైన ఫలితాలు) మనకు శుభవార్తను చెపుతాయని అన్నారు. కేసీఆర్ తోనే తెలంగాణ అనే హ్యాష్ ట్యాగ్ ను జతచేశారు.

Related posts

బీఆర్ఎస్ బీజేపీలో క‌లిసే ప్ర‌స‌క్తే లేదు .. తేల్చిచెప్పిన ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి

Ram Narayana

స్థానిక ఎన్నికల్లో 30 ఏళ్ల నిబంధనకు స్వస్తి.. ఇద్దరు పిల్లల నిబంధన రద్దు..!

Ram Narayana

ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ 20 లక్షల ఇళ్లు నిర్మిస్తాం!: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ram Narayana