Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

నైజీరియాలో 200 మంది చిన్నారుల‌ను కిడ్నాప్ చేసిన ఉగ్ర‌వాదులు…

నైజీరియాలో 200 మంది చిన్నారుల‌ను కిడ్నాప్ చేసిన ఉగ్ర‌వాదులు
-ఉత్తర నైగర్ రాష్ట్రంలోని టెజీనా న‌గ‌రంలో ఘ‌ట‌న‌
-మారణాయుధాలతో వచ్చిన ఉగ్ర‌వాదులు
-డ‌బ్బు కోసం ప‌దే ప‌దే కిడ్నాప్ ఘ‌ట‌న‌లు

నైజీరియాలోని ఓ పాఠ‌శాల నుంచి సుమారు 200 మంది విద్యార్థులను ఉగ్ర‌వాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఉత్తర నైగర్ రాష్ట్రంలోని టెజీనా న‌గ‌రంలోని సలిహూ తంకో ఇస్లామిక్ పాఠ‌శాలలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. మారణాయుధాలతో వచ్చిన ఉగ్ర‌వాదులు పాఠశాలపై దాడి చేశారని అక్క‌డి అధికారులు మీడియాకు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌ వ్యక్తి మృతి చెందాడ‌ని వివ‌రించారు.

అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు జ‌రుపుతున్నారు. కాగా, డ‌బ్బుకోసం పాఠ‌శాల్ల‌లో ముష్క‌రులు వరుసగా దాడులకు పాల్ప‌డుతూ క‌ల‌క‌లం రేపుతున్నారు. కొన్ని నెల‌ల క్రితం కూడా జాంఫారా రాష్ట్రంలోని జాంగెబేకు చెందిన ఓ బోర్డింగ్ స్కూలు నుంచి 300 మంది బాలిక‌ల‌ను ముష్క‌రులు కిడ్నాప్ చేసి, అనంత‌రం విడిచిపెట్టారు. ఆరు నెల‌ల్లో ఇటువంటి కిడ్నాప్‌ ఘ‌ట‌న‌లు ఆరుసార్లు జ‌రిగాయి.

Related posts

ప్రేమించ‌ట్లేద‌ని అమ్మాయిని క‌త్తితో పొడిచి చంపిన యువ‌కుడు.. అత‌డిని కొట్టి చంపిన స్థానికులు

Drukpadam

గంజాయి మత్తులో చిన్నారిపై హత్యాచారం!

Ram Narayana

మ‌హిళ‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డ మాజీ సీఐ నాగేశ్వ‌ర‌రావు డిస్మిస్‌!

Drukpadam

Leave a Comment