Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

హోటల్ ఎల్లా వద్ద రేవంత్ అనుచరుల రచ్చ.. పోలీస్ స్టేషన్ కు తరలింపు

  • హోటల్ ఎల్లాలో రేవంత్, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
  • రేవంత్ సీఎం అంటూ హోటల్ గేటు వద్ద కొందరు యువకుల నినాదాలు
  • ఆత్మహత్యాయత్నం చేసిన కొందరు యువకులు

టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్ లోని హోటల్ ఎల్లాలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొందరు యువకులు హోటల్ వద్ద రచ్చ చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అంటూ వారు నినాదాలు చేశారు. సీఎంను ప్రకటించడంలో జాప్యం చేస్తున్నారంటూ కొందరు ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో, ఆందోళన చేస్తున్న వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు పీసీపీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ రెడ్డి మాట్లాడుతూ… కొత్త సీఎం విషయంలో ఎలాంటి గందరగోళం లేదని చెప్పారు. మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికే సీఎంగా అవకాశం ఇవ్వాలని పరిశీలకులకు చెప్పారని తెలిపారు. అయితే, పార్టీలో అంతర్గతంగా చర్చించే విషయాలు చాలా సున్నితమైనవని… అందుకే వాటిని బహిర్గతం చేయలేకపోతున్నామని చెప్పారు.

ముఖ్యమంత్రి అభ్యర్థి: సర్వేలో 73 శాతం మంది రేవంత్ రెడ్డి వైపు మొగ్గు

  • ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై డిజిటల్ మీడియా సర్వే
  • సర్వేలో ఆరు లక్షలమంది నెటిజన్లు
  • 73 శాతం రేవంత్ రెడ్డికి, 16 శాతం మల్లు భట్టి విక్రమార్కకు అనుకూలంగా ఓట్లు
Survey reveals in favour revanth reddy for cm post

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వైపు అధికమంది మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి అభ్యర్థి అంశంపై ఢిల్లీలో జోరుగా చర్చలు జరుపుతోంది. దాదాపు రేవంత్ రెడ్డి పేరు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి? అనే అంశంపై డిజిటల్ మీడియా సంస్థ వే2న్యూస్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆరు లక్షలమంది పాల్గొన్నారు. ఇందులో మెజార్టీ సభ్యులు రేవంత్ రెడ్డి పేరును సూచించారు. డిజిటల్ మార్గంలో జరిగిన ఈ సర్వేలో 73 శాతం మంది రేవంత్ రెడ్డి, 16 శాతం మంది మల్లు భట్టి విక్రమార్కకు అనుకూలంగా ఓటు వేశారు. ఐదు శాతం మంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మూడు శాతం మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు వైపు మొగ్గు చూపారు.

రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకునే యత్నం

గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా వద్ద పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు… రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారు హోటల్లోకి దూసుకువెళ్లే ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు… కార్యకర్తలను నిలువరించి బయటకు పంపించారు. ఈ సమయంలో ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతనిని అడ్డుకున్నారు. దాదాపు రెండు రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పదవి కోసం రేవంత్ రెడ్డి, మల్లు బట్టి విక్రమార్క వంటి నేతలు పోటీ పడ్డారు. అయితే రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. సాయంత్రం డీకే శివకుమార్ సీఎం అభ్యర్థిపై ప్రకటన చేయనున్నారు.

Related posts

బండి సంజయ్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ..బీజేపీ కార్యాలయంలో దిగబెట్టిన వైనం!

Ram Narayana

హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్‌లో అర్ధరాత్రి రభస..టిక్కెట్టు డబ్బులు తిరిగిచ్చేసిన యాజమాన్యం

Ram Narayana

శ్రీనివాస్ రెడ్డికి సుమన్ టీవీ చైర్మన్ శుభాకాంక్షలు

Ram Narayana

Leave a Comment