తెలంగాణ వార్తలు

శ్రీనివాస్ రెడ్డికి సుమన్ టీవీ చైర్మన్ శుభాకాంక్షలు

ఇటీవల తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కె. శ్రీనివాస్ రెడ్డిని, సుమన్ టీవీ చైర్మన్ సుమన్ మర్యాద పూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిజంలో దాదాపు యాభై యేండ్ల అనుభవం, అవగాహన కలిగి ఉండడమే కాకుండా, ఉమ్మడి రాష్ట్రంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన సీనియర్ సంపాదకులు శ్రీనివాస్ రెడ్డిని మీడియా అకాడమీ చైర్మన్ గా ప్రభుత్వం నియమించడం మీడియా రంగంలో శుభ పరిణామమని సుమన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విరాహత్ అలీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. కిరణ్ కుమార్, అజిత, హెచ్.యూ.జే అధ్యక్షులు శిగా శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఒక్కో పరీక్ష ఒక్కో జిల్లాలో.. గురుకుల టీజీటీ పరీక్ష రాసేదెలా?అభ్యర్థుల గగ్గోలు

Ram Narayana

మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం రూ.3.70 కోట్లు విడుదల…

Ram Narayana

ఇంటర్ ఫలితాల విషాదం: ఫెయిలయ్యామని ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య…

Ram Narayana