పేరుకే ముగ్గురు మంత్రులు జిల్లాకు ఒరిగిందేమిటి …?ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి మచ్చగా మిగిలిన వెలుగుమట్ల భూదాన భూముల్లో గుడిశల తొలగింపుపేరుకే ముగ్గురు మంత్రులు జిల్లాకు ఒరిగిందేమిటనే విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి .ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకోని వస్తే ఎన్నికల వాగ్దానాలను విస్మరించడమే కాకుండా గతంలో ఇచ్చిన పాఠాలను కూడా పాడుకోబెట్టారనే విమర్శలను మూటగట్టుకుంటున్నారు .వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోగల భూదాన భూముల్లో గ్రామీణ పేదల సంఘం పేరుతో ఇల్లు లేని నిరుపేదలు గుడిశలు వేసుకుంటే వాటిని తొలగించడం ప్రజా ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ మంత్రులకు మచ్చగా మిగిలింది ..చివరకు కొంతమందికి అక్కడే తిరిగి స్థలాలు ఇచ్చినా కూల్చివేత గాయాలు మానేట్లు లేవు . ముగ్గురు ముగ్గురే వారు ఏది తలుచుకుంటే అది చేసే సత్తా శక్తి ఉన్న నేతలే …ఇద్దరు కొత్తగా మంత్రులు కాగా మరొకరు సుదీర్ఘ అనుభవం కలిగినవారు . రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే ముగ్గురు మంత్రులు జిల్లాను ఎందుకు పట్టించుకోవడం లేదనే అభిప్రాయాలు కలుగుతున్నాయి . జిల్లాలో అభివృద్ధికి వారు ఏమాత్రం పనిచేయడం లేదా అంటే కాదని చెప్పలేము కానీ రొటీన్ కార్యక్రమాలపైనే ద్రుష్టి పెడుతున్నారని విమర్శలు ఉన్నాయి. యువతకు ఉపాధి ఉద్యోగాలు , రైతులకు మేలు చేసే అనుబంధ పరిశ్రమలు , కొత్త పారిశ్రామిక వాడలు మహిళలకు స్వతంత్రంగా ఎదిగేందుకు కావాల్సిన చేయిత ఇవ్వడంలో సహకారం అందడంలేదని విమర్శలు ఉన్నాయి. ఒకప్పుడు జిల్లా నుంచి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన జలగం వెంగళరావు తర్వాత జిల్లాకు కొద్దోగొప్పో మంచి చేశారని తుమ్మల నాగేశ్వరరావుకు పేరుంది .నిజానికి తెలుగుదేశం హయాంలో ఆయన జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టించారు .ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అప్పట్లో ఆయన తమదైన ముద్ర వేశారు ..కానీ నేడు జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా ఒరిగిందేమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి …తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు బీఆర్స్ పరిపాలించిన అనంతరం ఆపార్టీ మీద విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు . రేవంత్ రెడ్డి నేతృత్వంలో లోని కాంగ్రెస్ సర్కార్ కొలువు దీరింది . మంత్రివర్గంలో ఖమ్మం జిల్లాకు గతంలో ఎన్నడూ లేని ప్రాధాన్యత దక్కింది .ఏకంగా మూడు మంత్రిపదవులు జిల్లాకు వచ్చాయి . డిప్యూటీ సీఎం గా సీనియర్ కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క కీలకమైన ఆర్థిక శాఖతోపాటు విద్యుత్, మైనింగ్ , ప్రణాళికల శాఖామంత్రిగా ఉండగా మరో సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు అతిముఖ్యమైన వ్యవసాయశాఖ మంత్రి తోపాటు కో-ఆపరేటివ్, చేనేత, జౌళి మార్కెటింగ్ శాఖల మంత్రిగా , మరో కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ , గృహనిర్మాణం , సమాచార పౌరసంబంధాల శాఖామంత్రిగా ఉన్నారు …ఒక రకంగా చెప్పాలంటే అన్ని కీలక శాఖలకు మంత్రులుగా ఖమ్మం జిల్లాకు చెందినవారు ఉండటం గర్వకారణమే అయినా వారి నుంచి ఆశించిన ఫలితాలు రావడం లేదని విమర్శలు ఉన్నాయి . సీతమ్మసాగర్ జలాలు జిల్లాకు వచ్చాయని చెపుతున్నప్పటికీ బీఆర్స్ హయాంలో ప్రారంభించిన పథకమేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి .ఇక జిల్లా కేంద్రమైన ఖమ్మంకు తీగలవంతెన మున్నేరుకు వరద నగరంలోకి ప్రవేశించకుండా కట్టిన రిటైనింగ్ వాల్ కూడా బీఆర్స్ హయాంలో ప్రాంభించినవే కావడం చర్చనీయాంశంగా మారింది .. ఈ ఘనత మాదేనని వారు అంటూ కాంగ్రెస్ మంత్రుల మాటలను ఎద్దేవా చేస్తున్నారు .. ముగ్గురు మంత్రులతో జిల్లాకు మంచి రోజులు వస్తాయని భావించిన ప్రజలు ఆశించిన స్థాయిలో పనులు జరగటంలేదనే అభిప్రాయంతో ఉన్నారు …జిల్లాకు ఒరిగిందేమిటనే ప్రశ్న ఉదయిస్తుంది . ఆయా శాఖల పనితీరుతోపాటు జిల్లాలో పేరుకొని పోయిన పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే చందంగా ఉన్నాయనే అభిప్రాయాలూ బలంగా వినిపిస్తున్నాయి..
Save or share this story as a newspaper-style Epaper Clip: