- రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం రేపే
- ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలకు ఆహ్వానాలు పంపిన తెలంగాణ కాంగ్రెస్
- పలువురు సినీ ప్రముఖులకు కూడా ఆహ్వానాలు
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేతలతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినేతలకు తెలంగాణ పీసీసీ ఆహ్వానాలు పంపింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్, మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లకు ఆహ్వానాలను పంపించారు. అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, చిదంబరం, సిద్ధరామయ్య, డీకే శివకుమార్, వాయలార్ రవి, సుశీల్ కుమార్ షిండే తదితర సీనియర్ నేతలకు ఆహ్వానాలు అందాయి. అమరవీరుల కుటుంబాలను కూడా ఆహ్వానించారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రొఫెసర్ హరగోపాల్, కంచె ఐలయ్య తదితరులకు కూడా ఆహ్వానాలు పంపారు. పలువురు సినీ ప్రముఖులను కూడా ఆహ్వానించారు.