ఈటల మెట్ జె పి నడ్డా … రాజకీయ భవిష్యత్ పై హామీ!
-ఈటల కు కేంద్రమంత్రి ప్రదవి ఆఫర్ ఇచ్చిందా ?
-రాజ్యసభకు పంపేందుకు హామీ ఇచ్చినట్లు ప్రచారం
-ఈటల బీజేపీలో చేరికకు గ్రీన్ సిగ్నల్ …నడ్డాతో భేటీ
-భేటీలో నడ్డాతో పాటు బండి సంజయ్, తరుణ్ ఛుగ్, వివేక్
-తన అనుచరులతో భేటీ తర్వాత చెబుతన్న ఈటల
తెలంగాణ రాజకీయాలు హస్తినలో హేడెక్కాయి. ….. ఈటల ఢిల్లీలో జె పి నడ్డా ను కలిశారు… తెలంగాణ లో రాజకీయపార్టీలన్నీ ఈటల రాజకీయ కదలికలపై ఆరా తీస్తున్నాయి. ఆయన న్డడ్తో భేటీలో తెలంగాణ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చినట్లు తెలిసింది. తన అభిప్రాయాలను బీజేపీ అధ్యక్షుడితో పంచుకున్నారు .
బీజేపీ పార్టీలో చేరితే కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు కేంద్ర నాయకత్వ హామీనిచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఈటలను రాజ్యసభకు నామినేట్ చేయడం ద్వారా కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అయితే అటు బీజేపీ గాని ఇటు ఈటల అనుచరులుగాని దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు . ఎట్టి పరిస్థితిలోను ఈటలను బీజేపీ లో చేర్చుకోవడం ద్వారా తెలంగాణాలో ఉద్యమకారులకు ఒక భరోసా కల్పించటంతో పాటు 2023 ఎన్నికల్లో అధికారం దిశగా అడుగులు వేయాలనే ఎత్తుగడలతో పావులు కదుపుతుంది. అందులో భాగంగానే ఈటలను తెలంగాణ బీజేపీ నాయకత్వం ఢిల్లీకి తీసుకోని వెళ్లారు . మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం ఖాయమయింది. ఢిల్లీకి వెళ్లిన ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఈటలతో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్, తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జి తరుణ్ ఛుగ్ తదితరులు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి హుజూరాబాద్ చేరుకున్న తర్వాత తన అనుచరులతో ఈటల భేటీ కానున్నారు. అనంతరం బీజేపీలో చేరే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు.
ఎమ్మెల్యే పదవితో పాటు, టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఈటల రాజీనామా చేయబోతున్నారు. ఐదారు రోజుల్లో ఆయన బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఈటల ఢిల్లీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మారుతున్న రాజకీయ పరిణామాలను టీఆర్ఎస్ పార్టీ కూడా నిశితంగా గమనిస్తోంది. ఈటల బీజేపీలో చేరిన తర్వాత తెలంగాణ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరగనున్నాయో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.