- ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటరు జాబితా షెడ్యూల్ విడుదల
- ఫిబ్రవరి 24న ముసాయిదా జాబితాను ప్రకటించనున్న ఈసీ
- మార్చి 14వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ
- ఏప్రిల్ 4వ తేదీన ఓటర్ల జాబితాను విడుదల చేయనున్న ఈసీ

తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఓటరు జాబితా షెడ్యూల్ విడుదలైంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటరు జాబితా షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇటీవల ఈ స్థానాలు ఖాళీ కావడంతో ఈసీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 24న ముసాయిదా జాబితాను ప్రకటిస్తుంది. మార్చి 14వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఏప్రిల్ 4వ తేదీన ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. పట్టభద్రులు అందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం తెలిపింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: