Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా మారిన షర్మిల రాజకీయ అడుగులు…

వైయస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై యస్ షర్మిల వేస్తున్న రాజకీయ అడుగులు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా మారాయి….తెలంగాణాలో రాజన్న సంక్షేమ పాలన తెస్తానని అందుకు తనకు అధికారం ఇవ్వాలని చెప్పి తెలంగాణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆర్బాటంగా ఏర్పాటుచేశారు …తెలంగాణలో సుమారు 4 వేల కి .మీ పాదయాత్ర చేశారు …నిరుద్యగుల సమస్యపై చిత్తశుద్ధితో పోరాటం చేశారు …ఎన్ని విమర్శలు , ఆటంకాలు వచ్చిన ఆమె తన దారి రహదారి అని ముందుకు సాగారు …ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించారు …ఖమ్మం సమీపంలో కార్యాయలం నిర్మాణం కోసం భూమిపూజ చేశారు …వైయస్ ఆర్ విగ్రహాన్ని సైతం ఆవిష్కరించారు …తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ లో చేరేందుకు ఢిల్లీలో సోనియా ,రాహుల్ ,ప్రియాంక గాంధీని కలిశారు …తెలంగాణ కాంగ్రెస్ లో కొందరు నేతలు ఆమె చేరికను వ్యతిరేకించడంతో అది వాయిదా పడింది …దీంతో ఎన్నిలకల్లో పోటీచేయాలా …? వద్ద ..?అనే దానిపై తర్జనభర్జన పడ్డారు …చివరకు ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పి ,కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు …ఆమె నిర్ణయాన్ని ఆమె పార్టీలో వాళ్లే తీవ్రంగా విభేదించి పార్టీకి గుడ్ బై చెప్పారు …అనేక మంది నేతలు ఆమెపై గుర్రుగా ఉన్నారు …ఆమెను నమ్ముకుని తమ రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నామని కొందరు బాహాటంగానే అంటున్నారు …తిరిగి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి…దీంతో ఆమె రాజకీయ అడుగులపై మళ్ళీ చర్చ మొదలైంది …ఆమె ఎదో సాధించాలనే ఉద్దేశంతో తప్పటడుగులు వేస్తున్నారా ….? అనే సందేహాలు కలుగుతున్నాయి…

షర్మిల ఈ నెల 4న కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న షర్మిల కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు.

ఈ ఉదయం 11 గంటలకు షర్మిల తన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో పార్టీ విలీనంపై చర్చించనున్నట్టు సమాచారం. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంపై షర్మిల మాట్లాడుతూ కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. అందుకనే ఆయన మళ్లీ అధికారంలోకి రాకూడదని కోరుకున్నట్టు తెలిపారు. తాను పోటీ చేస్తే 55 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌పై ప్రభావం చూపుతుందని, అదే జరిగితే తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించినట్టు తెలిపారు. కాగా, షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారన్న వార్త ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హీట్ పెంచింది.

Related posts

నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరోసారి ఉద్రిక్తత

Ram Narayana

డీవోపీటీ ఆదేశాలతో ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్ అధికారులు!

Ram Narayana

తిరుమలలో శ్రీవారి ఆలయంపై ఎగిరిన హెలికాప్టర్…

Ram Narayana

Leave a Comment