విజయవాడ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన గెలుస్తా… కేశినేని నాని
చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదు ..
తాను వద్దని చంద్రబాబే అనుకున్నారన్న కేశినేని నాని
ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తానని ధీమా
మీడియాను పట్టించుకోవడాన్ని మానేశానన్న కేశినేని
టీడీపీ నుంచి తనకు తిరిగి విజయవాడ పార్లమెంట్ టికెట్ రాదని నిర్దారించుకున్న కేశినేని నాని అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు …నాని శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు ..మీడియా ఇష్టం వచ్చినట్లు రాసుకుంటుంది …మీ ఇష్టం ఎలా రాసుకుంటారో రాసుకోండి అంటూ మీడియా పై కూడా నాని రుసరుసలాడారు …
రెండుసార్లు విజయవాడ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన తనను కాదని మరొకరికి టికెట్ ఇవ్వాలని టిడిపి అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని అసహనం ప్రకటించారు … తాను చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదని ఒకటింట కఠువుగానే అన్నారు .. ఆయనే తనను కాదని మరొకరికి సీటు ఇవ్వాలని ముందుగానే నిర్ణయించుకున్నారని ఆయన పథకంలో భాగంగానే తనకు సీటు ఇవ్వడంలేదని అన్నారు …అందువల్ల ఢిల్లీ వెళ్లేందుకు ఒక ఫ్లైట్ కాకపోతే మరో ఫ్లైట్ ఎక్కొచ్చని అది దొరక్కపోతే ప్రైవేట్ జట్ లో వెళ్ళొచ్చని అందువల్ల వెళ్లేందుకు ఇబ్బంది లేదని అన్నారు…తన పార్టీ మార్పు విషయాన్నీ చెప్పకనే చెప్పారు …దీంతో విజయవాడ రాజకీయాలు సంచలనంగా మారే అవకాశాలు ఉన్నాయి.. నాని సోదరుడు చిన్నిని విజయవాడ పార్లమెంట్ కు టిడిపి అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది… ఇప్పటికే చంద్రబాబు అందుకు అనుగుణంగా సంకేతాలుఇచ్చారు.. చిన్ని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు … తిరువూరులో జరగబోయే బహిరంగ సభ బాధ్యతలను కూడా చిన్నికి అప్పగించడం ద్వారా చంద్రబాబు ఖచ్చితమైన సంకేతాలు ఇచ్చారు … దీంతో నాని తనదారి తాను చూసుకునే పనిలో పడ్డారు … తన ప్రయాణం ఆగదని ఇదిగాక పోతే మరో పార్టీ అన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు అందువల్ల విజయవాడ సీటు విషయంలో అన్నదమ్ముల మధ్య నెలకొన్న వివాదం టిడిపికి తలనొప్పిగా మారే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు… నానికి టికెట్ ఇవ్వకపోతే ప్రతికూల ఫలితాలు రావచ్చని అభిప్రాయాలు వ్యక్తం అవుతుంది… నాని పై ప్రత్యేకంగా నియోజకవర్గంలో వ్యతిరేకత లేదు ఆయన పట్ల ప్రజల్లో సానుకూలత ఎక్కువగా ఉంది … ఆయన ఏ పార్టీ లైవ్ తీసుకుంటారు కాంగ్రెస్ నా …? బిజెపి నా..? లేక వైఎస్ఆర్సిపి నా..? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా …?అనేది క్లారిటీ రావాల్సి ఉంది ….
ఎంపీ కేశినేని నానిని టీడీపీ అధినేత చంద్రబాబు పక్కన పెట్టేయడం విజయవాడ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. తమ అధినేత ఆదేశాలను శిరసా వహిస్తానని ఫేస్ బుక్ ద్వారా ఆయన తెలిపారు. అయితే, కాసేపటి క్రితం మీడియాతో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనని వద్దని చంద్రబాబే అనుకున్నారని, తాను అనుకోలేదని ఆయన అన్నారు. తన మీద, విజయవాడ ప్రజల మీద తనకు నమ్మకం ఉందని, తానేం చేయాలో కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తానని తాను ఇంతకు ముందే చెప్పానని అన్నారు. పదేళ్లుగా విజయవాడను ఎంతో అభివృద్ధి చేసిన తాను ఖాళీగా ఉంటే కార్యకర్తలు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.
చంద్రబాబుకు తాను వెన్నుపోటు పొడవలేదని… పొడిస్తే ఇంకా మంచి పొజిషన్ లో ఉండే వాడినని నాని చెప్పారు. విజయవాడ ఎంపీగా తాను హ్యాట్రిక్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీకి వెళ్లాలంటే ఒక ఫ్లైట్ కాకుంటే మరొక ఫ్లైట్ చూసుకోవాలని… ఏ ఫ్లైట్ లేకపోతే ప్రైవేట్ జెట్ లో వెళ్లాలి కదా అంటూ పార్టీ మార్పు గురించి సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. నామినేషన్ ల చివరి రోజు వరకు నాన్చకుండా… ఎన్నికలకు చాలా ముందుగానే తనకు టికెట్ లేదని చెప్పేశారని అన్నారు.
చెప్పాల్సిందంతా ఫేస్ బుక్ లో క్లియర్ గా చెప్పేశానని… ఎవరికి అర్థమైనట్టు వారు రాసుకోవచ్చని మీడియాను ఉద్దేశించి నాని అన్నారు. మీడియాను పట్టించుకోవడాన్ని తాను ఎప్పుడో మానేశానని చెప్పారు. మీడియాకు మసాలా కావాలని… తినబోతూ రుచులెందుకని, ఒకేరోజు అన్ని విషయాల గురించి మాట్లాడటం ఎందుకని అన్నారు. రేవంత్ రెడ్డి దొంగ అంటూ ఓ వర్గం మీడియా తెలంగాణ ఎన్నికల్లో ఎంతో ప్రచారం చేసిందని… ఇప్పుడు ఆయన సీఎం అయి కూర్చున్నారని చెప్పారు. మీడియా పీకింది ఏముందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేశినేని నాని వ్యాఖ్యలపై కేశినేని చిన్ని స్పందన!
వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా తన స్థానంలో మరో వ్యక్తికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారని…. పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని తమ అధినేత చంద్రబాబు ఆదేశించారని ఎంపీ కేశినేని నాని తెలిపిన సంగతి తెలిసిందే. తమ అధినేత ఆదేశాలను శిరసావహిస్తానని కూడా ఆయన చెప్పారు.
ఈ నేపథ్యంలో నాని సోదరుడు కేశినేని చిన్ని స్పందిస్తూ… కేశినేని నాని ఫేస్ బుక్ పోస్టుతో తనకు సంబంధం లేదని చెప్పారు. కుటుంబంలో కలహాలు ఉండటం సహజమేనని అన్నారు. చంద్రబాబును మళ్లీ సీఎం చేయడమే తన ధ్యేయమని చెప్పారు. ప్రస్తుతం తమ దృష్టి మొత్తం తిరువూరు సభను విజయవంతం చేయడంపైనే ఉందని అన్నారు. తిరువూరు సభకు లక్షకు పైగా పార్టీ శ్రేణులు, అభిమానులు వస్తారని తెలిపారు. టీడీపీలో తాను ఒక సామాన్య కార్యకర్తను మాత్రమేనని చెప్పారు.
మరోవైపు, ఈ నెల 7న తిరువూరులో జరిగే చంద్రబాబు సభకు ఏర్పాట్ల బాధ్యతను కేశినేని చిన్నికి టీడీపీ అప్పగించింది. ఈ సారి విజయవాడ ఎంపీ టికెట్ కూడా చిన్నికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంత కాలంగా విజయవాడ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఆయన పెద్ద ఎత్తున రాజకీయ, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.