Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు వేయాలని వైసీపీ ఫిర్యాదు

  • ఎన్నికల వేళ వైసీపీని వీడుతున్న పలువురు నేతలు
  • టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు
  • టీడీపీ, జనసేనలో చేరిన చెరొక ఎమ్మెల్సీ

ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ వైసీపీ నుంచి బయటకు వస్తున్న నేతల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీని వీడారు. ఈ నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్ లపై వేటు వేయాలని మండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేసింది. వైసీపీని వీడిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరగా… ఎమ్మెల్సీలలో రామచంద్రయ్య టీడీపీలో చేరగా.. వంశీ జనసేనలో చేరారు. 

Related posts

సైకో పాలన పోవాలనే టీడీపీ, జనసేన పొత్తు … యువగళం ముగింపు సభలో చంద్రబాబు…

Ram Narayana

పవన్ ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం నుంచి నేను బరిలో దిగుతా: ఎస్వీఎస్ఎన్ వర్మ

Ram Narayana

నేను జగన్‌ కాళ్లు మాత్రమే పట్టుకుంటా.. విమర్శలకు బదులిచ్చిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి

Ram Narayana

Leave a Comment