క్రైమ్ వార్తలుతెలుగు రాష్ట్రాలు

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై హైదరాబాద్ లో కేసు

మల్లు రవి ఫిర్యాదు… ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై హైదరాబాద్ లో కేసు

  • సోనియాపై అవాస్తవాలు మాట్లాడారంటూ ఫిర్యాదు
  • నారాయణస్వామిపై చర్యలు తీసుకోవాలన్న మల్లు రవి
  • బేగం బజార్ పీఎస్ లో కేసు నమోదు

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫిర్యాదు నేపథ్యంలో, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై హైదరాబాదులో కేసు నమోదైంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ గురించి అసత్య వ్యాఖ్యలు చేశారంటూ మల్లు రవి బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయణస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

వైఎస్ మరణానికి కారణం సోనియా గాంధీ, చంద్రబాబేనని నారాయణస్వామి ఇటీవల షర్మిల కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను మల్లు రవి తప్పుబట్టారు. 

ఉమ్మడి ఏపీ సీఎంగా వ్యవహరించిన వైఎస్సార్ కు సోనియా ఎంతో ప్రాధాన్యతనిచ్చారని వెల్లడించారు. వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైనప్పుడు సోనియా ప్రత్యేకంగా విమానాలు పంపించి వెతికించారని తెలిపారు.

ప్రతికూల వాతావరణం వల్లే హెలికాప్టర్ ప్రమాదం జరిగిందన్న విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గ్రహించాలని మల్లు రవి హితవు పలికారు. నారాయణస్వామి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Related posts

అత్యాచార యత్నాన్ని అడ్డుకున్న యువతి.. రాయితో కొట్టి చంపిన కామాంధుడు!

Ram Narayana

శ్రీశైలం డ్యామ్ గేట్ల లీకేజీ : ఆందోళన వద్దు, కానీ నిర్వహణ అవసరం అంటున్న కన్నయ్య

Ram Narayana

షర్మిలకు ఏఐసీసీలో కీలక భాద్యతలు అప్పగించనున్నారా…?

Ram Narayana