Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

అంబటి రాయుడు నిన్న అటు.. నేడు ఇటు …రేపు….?

వైసీపీలో ఉంటే నా కల నెరవేరదనిపించింది: అంబటి రాయుడు
గత డిసెంబరులో వైసీపీలో చేరిన రాయుడు
కొన్నిరోజుల కిందటే రాజీనామా
ఈ మధ్యాహ్నం పవన్ కల్యాణ్ తో భేటీ

అయితే అటు లేకపోతే ఇటు… ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడి విషయంలో అక్షరాల ఇది నిజమనిపిస్తుంది … ఎందుకంటే వైసిపి లో చేరేందుకు ఆయన నిర్ణయించుకుని , గుంటూరు పార్లమెంటు నుంచి పోటీచేయాలని లక్ష్యంతో విస్తృత పర్యటన చేశారు… ఆ సందర్భంగా ప్రజలును అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. అనేక గ్రామాలు తిరిగారు… ఆ సందర్భంగా ఆయన దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలు పరిష్కరించానని ఆయనే చెపుతున్నారు … అయితే వైసీపీ బావాజాలానికి తన జాలానికి సింక్ కావట్లేదని అందువల్ల రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నానని అన్నారు .అయితే తన బంధుమిత్రులు ఒకసారి పవన్ కళ్యాణ్ ను కలవమని అంటే కలిసి ఆయనతో పలు విషయాలు చర్చించడం జరిగిందని తమ ఇద్దరి ఆలోచనలు ఒకే రకంగా ఉన్నాయని ఆయన్ను కలవటానికి ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు ..

రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చుననేది అంబటి రాయుడు ద్వారా మరోసారి రుజువైంది … జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అంబటి రాయుడు కొద్దిరోజుల తర్వాత రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు …ఆసందర్భంగా తీరిక లేకుండా టికెట్ ఆడే బిజీ లో ఉన్నందున రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు .. తిరిగి రెండు రోజుల్లోనే మళ్లీ మనసుకు మార్చుకుని రాజకీయాల్లో ఉండాలని నిర్ణయానికి వచ్చి పవన్ కళ్యాణ్ కలవటం చర్చనీయాంశంగా మారింది… అసలు అంబటి రాయుడు ఏమి చేయదలచుకున్నాడు ఏం చెప్పదలుచుకున్నాడనేది విచిత్రంగా ఉందనేది ప్రజలు అనుకుంటున్నారు ….ముందే పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణం చేయొచ్చు కదా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి …

రాయుడి మాటల్లోనే ….

“పరిశుద్ధ హృదయంతో, కల్మషం లేని ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసేందుకు నేను రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల్లోకి వచ్చి నేను ఏం చేయాలనుకుంటున్నానో అవన్నీ చేయవచ్చు అన్న ఉద్దేశంతో వైసీపీలో చేరాను.

వాస్తవిక పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు నేను క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాను. ఎన్నో గ్రామాలు తిరిగి, ఎంతో మంది ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నాను. కొన్ని సమస్యలను వ్యక్తిగతంగా పరిష్కరించాను కూడా. ఎంతో సామాజిక సేవ చేశాను.

అయితే కొన్ని కారణాల వల్ల…. వైసీపీలో కొనసాగితే నా కలను నెరవేర్చుకోలేనని అనిపించింది. ఇందులో ఎవరినీ తప్పుబట్టడంలేదు. నా భావజాలానికి, వైసీపీ సిద్ధాంతాలకు ఏమాత్రం సారూప్యత లేదన్న విషయం అర్థమైంది. ఈ నేపథ్యంలో రాజకీయాల నుంచి తప్పుకుందామని నిర్ణయించుకున్నాను. ఫలానా స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అంశం కారణంగానే నేను రాజీనామా చేశాననడం అర్థరహితం.

కానీ నా శ్రేయోభిలాషులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు “ఓసారి పవన్ అన్నను కలిసి చూడు… ఆయన భావజాలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు… ఆ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకో” అని చెప్పారు. ఈ క్రమంలోనే నేను పవన్ అన్నను కలిసి చాలా సమయం పాటు చర్చించాను.

జీవితం గురించి, రాజకీయాల గురించి మేం ఎన్నో మాట్లాడుకున్నాం. ఆయనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఈ సమావేశం నాకెంతో సంతోషం కలిగించింది… ఎందుకంటే ఆయన సిద్ధాంతాలు, ఆలోచనలు…. నా భావజాలం, ఆలోచనలు ఒకేలా అనిపించాయి. ఆయనను కలవడం ఒక ఆనందకరమైన పరిణామం.

ప్రస్తుతం నేను క్రికెట్ ఒప్పందాల నేపథ్యంలో దుబాయ్ వెళుతున్నాను. ఏపీ ప్రజలకు సేవ చేసేందుకు నేను ఎల్లప్పుడూ ముందుంటాను, వారి కోసం చిత్తశుద్ధితో నిలబడతాను” అంటూ రాయుడు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు.

రాయుడికి వినాయక ప్రతిమను బహూకరించిన పవన్

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు ఇవాళ మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ ను కలిసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ భేటీ సందర్భంగా పవన్ కల్యాణ్ వెండితో చేసిన ఓ వినాయక ప్రతిమను అంబటి రాయుడుకు బహూకరించారు.

Related posts

ఢిల్లీలో ఆసక్తికర పరిణామం.. జేపీ నడ్డాతో చంద్రబాబు మాటమంతీ!

Ram Narayana

దోచుకున్న దొంగను పట్టుకుంటే ప్రశంసించకుండా విమర్శలు చేస్తావా?: పవన్ పై పేర్ని నాని ఫైర్

Ram Narayana

వైసీపీ నుంచి నేను గెలవకపోవడమే మంచిదైంది: దగ్గుబాటి వెంకటేశ్వరరావు

Ram Narayana

Leave a Comment