Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ యస్ ను వీడటమా…!నాన్సెన్స్ ,బేస్ లెస్ అంటూ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఫైర్ …!

పార్టీ మారతారని అంటున్నారు నిజమేనా …?అని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను “దృకపధం” పలకరించగా…నాన్సెన్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి ఇలాంటివి బేస్ లెస్ ప్రశ్న అంటూ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు…బీఆర్ యస్ ను వీడటమా…జరిగేపని కాదు …ఆలాంటి ఆలోచనలు నాదరికి కూడా చేరనివ్వను …రానున్న కాలం బీఆర్ యస్ దే…బీఆర్ యస్ కు మంచి భవిష్యత్ ఉంది …కేసీఆర్ ,కేటీఆర్ నన్ను ఎంతో ప్రేమతో చూసుకుంటారు … నేను అడిగింది ఏది కాదన కుండా చేశారు … కేసీఆర్ నాకు ఎంపీగా మంచి అవకాశం ఇచ్చారు …ఒక బీసీ బిడ్డగా ఎక్కడో ఇనగుర్తిలో పుట్టిన తనకు పెద్దల సభకు పంపి ఒక సమున్నతమైన స్థానం కల్పించారు …ఇది ఒక సామాన్యుడికి అసామాన్యమైన పదవి …ఇంతటి గుర్తింపునిచ్చిన కేసీఆర్ తోనే చివరిదాకా నాప్రయాణం…అని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు … ఈసందర్భంగా తెలంగాణ రాజకీయాలు , ఎన్నికల అనంతరం జరుగుతున్న పరిణామాలు , పార్లమెంట్ ఎన్నికలపై పలువిషయాలు ఆయన పంచుకున్నారు…నేను చట్ట సభలో ప్రవేశించాలనే కోరిక బలంగా ఉండేది …ఎంపీగా పోటీచేయాలని అనుకున్నాను …కానీ జరగలేదు …మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం వస్తే పోటీచేద్దామనుకున్నాను … కుదరలేదు .. అయినప్పటికీ చట్టసభల్లో ప్రవేశించాలనే తన కోరికను కేసీఆర్ తీర్చారు … 2 సంవత్సరాల కాలానికే నన్ను ఎంపిక చేసినందున తిరిగి అవకాశం ఇస్తామన్నారు … ఇస్తారనే విశ్వాసం ఉంది … ఇవ్వక పోయిన పార్టీ వీడను కేసీఆర్ ,కేటీఆర్ నాయకత్వంలో పార్టీ కోసం పనిచేస్తానని, కేసీఆర్ ఏపని అప్పగించిన బాధ్యతతో స్వీకరిస్తానని ,ఆయన నిర్ణయాన్ని శిరసావహిస్తానని ఇందులో రెండవమాటకు తావులేదని వద్దిరాజు స్ఫష్టం చేశారు …

రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ సీటు బీఆర్ యస్ తప్పకుండ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు …ఈమేరకు పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆధ్వరంలో మొన్న తెలంగాణ భవనంలో జరిగిన ఖమ్మం పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఎన్నికలపై దిశా నిర్దేశం చేయడం జరిగిందని అన్నారు …పార్టీ ఇంచార్జిలు అందరు పార్టీని గెలిపించాలని పట్టుదలతో ఉన్నారని అన్నారు …

కాంగ్రెస్ పార్టీలో సరైన అభ్యర్థి లేడని అందువల్ల తమదే విజయమని అభిప్రాయపడ్డారు …సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీచేస్తే అనే దానిపై ఆయన మాట్లాడుతూ ఆమె ఇక్కడకు ఎందుకు వస్తుందని అంటూనే రాకపోవచ్చుననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు …అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించి తప్పుచేశామనే భావన ప్రజల్లో కలుగుతుంది …పొరపాటు చేశామని బాధపడుతున్నారు … ఖమ్మం జిల్లాలో కూడా కొన్ని పొరపాట్లు జరిగాయని అందువల్ల ఫలితాలు తమకు ప్రతికూలంగా వచ్చాయని అన్నారు .. కేటీఆర్ చెప్పినట్లుగా కొంతమంది అభ్యర్థులను మార్చితే ఫలితం మరో విధంగా ఉండేదని ,బీఆర్ యస్ అధికారంలోకి వచ్చేదని పేర్కొన్నారు …మొన్న జరిగిన పొరపాట్లు పార్లమెంట్ ఎన్నికల్లో చేయబోమని తప్పకుండ ఓటమిని ఛాలంజ్ గా తీసుకోని ముందుకు పోతామన్నారు … కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు అమలు చేయడంలేదని దానిపై తమ కార్యాచరణ ఉంటుందని అన్నారు … కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానాలు అమలు చేయకుండా బీఆర్ యస్ ప్రభుత్వంపై నిందలు వేసే పని మొదలు పెట్టిందని విమర్శించారు … ప్రజలు కాంగ్రెస్ నాటకాలను త్వరలోనే తెలుసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపిస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు …

Related posts

వ్రతం చెడ్డా ఫలితం దక్కని జలగం వెంకట్రావు …!

Ram Narayana

తెలంగాణను ఎలా ముందుకు నడిపించాలో కాంగ్రెస్‌కు తెలుసు: ప్రియాంక గాంధీ

Ram Narayana

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ ఇంఛార్జుల నియామకం

Ram Narayana

Leave a Comment