తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ ఇంఛార్జుల నియామకం

  • అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారికి బాధ్యతలు
  • సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులకు బాధ్యతలు
  • మల్లు భట్టి,పొంగులేటి,తుమ్మల పొన్నం, దామోదర సహా పలువురికి బాధ్యతలు

రానున్న లోక్ సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జులను ప్రకటించింది. రాష్ట్రంలోని 117 లోక్ సభ నియోజకవర్గాలకు ఆ పార్టీ ఇంఛార్జులను నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారికి బాధ్యతలను అప్పగించింది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులకు బాధ్యతలు అప్పగించింది.

చేవెళ్ల, మహబూబ్ నగర్ నియోజకవర్గాలు – రేవంత్ రెడ్డి, సికింద్రాబాద్, హైదరాబాద్ – మల్లు భట్టి విక్రమార్క, నాగర్ కర్నూలు – జూపల్లి కృష్ణారావు, నల్గొండ – ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వరంగల్ – కొండా సురేఖ, మహబూబాబాద్, ఖమ్మం – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదిలాబాద్ – సీతక్క, పెద్దపల్లి – దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ – పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ – జీవన్ రెడ్డి, జహీరాబాద్ – పీ సుదర్శన్ రెడ్డి, మెదక్ – దామోదర రాజనర్సింహ, మల్కాజిగిరి తుమ్మల నాగేశ్వర రావు.

Related posts

దొర! పాలన చేతకాలేదు… క్షమాపణలు చెప్పు: కేసీఆర్‌పై వైఎస్ షర్మిల

Ram Narayana

నా పేరును మార్చడానికి మీరెవరు?: రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఆగ్రహం

Ram Narayana

60 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్‌లోకి తీసుకోవడం పెద్ద విషయం కాదు: ఈటల రాజేందర్ కౌంటర్

Ram Narayana