Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సలహాదారుగా వేంనరేందర్ రెడ్డి నియామకం…

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారులను నలుగురు సలహాదారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు ..మరో పక్క మరో రెండు మూడు రోజుల్లో నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేసే అవకాశం ఉంది …ఇటీవల దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రాష్ట్రానికి రానున్నారు …ఈలోగానే తన సలహాదారుగా మొదటి నుంచి తనకు అత్యంత నమ్మకస్తుడైన స్నేహితుడుగా ఉన్న వేంనరేందర్ రెడ్డిని తన ప్రత్యేక సలహాదారుగా నియమించుకున్నారు …అదే విధంగా తననే నమ్ముకుని ఉన్న షబ్బీర్ అలీ , మల్లు రవిలకు సలహాదారుల పదవులు ఇచ్చారు …అయితే షబ్బీర్ అలీ కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ అలాంటిది ఏమి లేదని దీనిద్వారా తేలిపోయింది. షబ్బీర్ అలీ కి ఎస్సీ , ఎస్టీ , బీసీ ,మైనార్టీ శాఖల సలహాదారుగా నిమించారు …ఇక మల్లు రవికి ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లో ఇచ్చిన ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి
పదవినే ఇస్తూ ఉత్తర్వులు జారీచేచారు …ప్రోటోకాల్ , ప్రజాసంబంధాల సలహాదారుగా హర్కర వేణుగోపాల్ రావు ను నియమించారు …మరి కొంతమంది సలహాదారులను మరి కొద్దీ రోజుల్లో నియమిస్తారని సమాచారం …

దీంతో రాష్ట్రంలో ఉన్న 54 కార్పొరేషన్ పదవుల భర్తీకి కూడా రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది…మొదట అన్ని కాకపోయినా కొన్ని కార్పొరేషన్ లను వెంటనే భర్తీ చేయాలనీ సీఎం భావిస్తున్నట్లు తెలుస్తుంది …అనేక మంది ఆశావహులు ,టికెట్స్ రానివాళ్లు , టికెట్స్ త్యాగం చేసిన వాళ్ళు కార్పొరేషన్ ,ఎమ్మెల్సీ పదవులకోసం ఆశతో ఎదురు చూస్తున్నారు ..ప్రతి ఉమ్మడి జిల్లాలో డజను మంది పైగానే కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు …ఎక్కువమందిని చైర్మన్ పదవుల్లో నియమించడం ద్వారా వారికీ గుర్తింపు ఇచ్చినట్లు అవుతుందని సీఎం భావిస్తున్నారు …ముందు ముందు ఎమ్మెల్సీలు , రాజ్యసభ సభ్యులుగా చేసే అవకాశాలు ఉన్నాయి..వారి స్థాయి ప్రజల్లో వారికున్న పలుకుబడి , పార్టీ పట్ల వారికున్న కమిట్ మెంట్ ఆధారంగా నియామకాలు చేపట్టాలనే యోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తుంది …

Related posts

హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

Ram Narayana

తెలంగాణ కాంగ్రెస్ ‘స్పెషల్ మేనిఫెస్టో’ విడుదల

Ram Narayana

కష్టపడి రాసిగా పోశాక ఎవరో వస్తే ఊరుకుంటానా?: ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు

Ram Narayana

Leave a Comment