Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

అయోధ్యను నా గుండెల్లో పెట్టుకొని ఢిల్లీకి తిరిగి వచ్చాను: రాష్ట్రపతికి ప్రధాని మోదీ లేఖ

  • అయోధ్య ధామ్‌లో గడిపిన క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేనన్న ప్రధాని మోదీ
  • సబ్ కా సాత్ సబ్ కా వికాస్‌కు రాముడే స్ఫూర్తి అన్న ప్రధాని
  • అంతకుముందు మోదీని అభినందిస్తూ రాష్ట్రపతి లేఖ

అయోధ్యను నా గుండెల్లో పెట్టుకొని ఢిల్లీకి తిరిగి వచ్చాను… అయోధ్య ధామ్‌లో గడిపిన క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేనని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని లేఖ రాశారు. తమ ప్రభుత్వం అనుసరిస్తోన్న సబ్ కా సాత్ సబ్ కా వికాస్‌కు శ్రీరామచంద్రుడే స్ఫూర్తి అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఫలితం అన్ని చోట్లా కనిపిస్తోందన్నారు.

మీరు రాసిన లేఖ తనకు అందే సమయానికి మనసు భావోద్వేగంతో నిండిపోయిందని.. దాని నుంచి బయటపడేందుకు మీ లేఖ ఎంతో సహాయపడిందని రాష్ట్రపతికి రాసిన లేఖలో ప్రధాని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడినట్లు తెలిపారు. ఇందుకు రాముడి మంత్రమే ఫలించిందన్నారు.

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని మోదీ 11 రోజుల పాటు నిష్ఠగా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి… ప్రధానిని అభినందిస్తూ రెండు రోజుల క్రితం లేఖ రాశారు. ఈ లేఖకు ప్రధాని ప్రత్యుత్తరం రాశారు.

Related posts

బాబా సిద్దిఖీ హత్యకేసు నిందితుడు బాలుడు కాదు.. తేల్చేసిన బోన్ అసిఫికేషన్ టెస్ట్

Ram Narayana

చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుని కన్నీటిపర్యంతమైన ప్రధాని మోదీ

Ram Narayana

బెంగాల్ లో 24 వేల స్కూల్ టీచర్ ఉద్యోగాలను రద్దు చేసిన హైకోర్టు…

Ram Narayana

Leave a Comment