Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ఎస్ ఒకట్రెండు స్థానాలకే పరిమితమవుతుంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడుతుందన్న ఉత్తమ్
  • కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలుస్తుందని ధీమా
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలపై విచారణ ప్రారంభించామన్న మంత్రి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ మంచి జోష్ లో ఉంది. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో బీఆర్ఎస్ ఛైర్మన్లపై అవిశ్వాసాలను పెట్టిస్తూ వాటిని కైవసం చేసుకుంటోంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో సైతం సత్తా చాటి బీఆర్ఎస్ కు చెక్ పెట్టాలనే పట్టుదలతో ఉంది. వెయ్యి అడుగుల గొయ్యి తవ్వి బీఆర్ఎస్ కు బొంద పెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే అంటున్న సంగతి తెలిసిందే. 

తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీనపడుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 14 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఒకట్రెండు స్థానాలకే పరిమితమవుతుందని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అన్నారు. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలపై విచారణ ప్రారంభించామని… అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఉత్తమ్ హెచ్చరించారు. జాన్ పహాడ్ దర్గా ఉర్సులో ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. దర్గా అభివృద్ధికి ఆయన కోటి రూపాయలను ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

Related posts

బీఆర్ఎస్‌‍ను వీడుతున్న వారిపై జాతీయ ఛానల్‌తో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు…

Ram Narayana

తుమ్మల వద్దకు కేసీఆర్ రాయబారం …?

Ram Narayana

బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై బంజారాహిల్స్ స్టేషన్‌లో కేసు నమోదు

Ram Narayana

Leave a Comment