Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన జనసేన.. ఇక మిగిలింది మూడే!

  • తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని ఆరణికి ప్రకటించడంపై స్థానిక నేతల గుర్రు
  • ఆ స్థానాన్ని ఆశిస్తున్న హరిప్రసాద్, కిరణ్ రాయల్, మరో ఇద్దరు నేతలు
  • 11 స్థానాలకు ఖరారు చేసిన అభ్యర్థులను పిలిచి ప్రచారం చేసుకోమని చెప్పిన పార్టీ అధిష్ఠానం
  • మచిలీపట్టణం నుంచి బాలశౌరి పోటీ

ఆంధ్రప్రదేశ్‌లో 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తున్న జనసేన ఇప్పటి వరకు ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, మరో 11 స్థానాలపై స్పష్టతనిచ్చింది. ఎంపిక చేసిన అభ్యర్థులను పిలిపించి ప్రచారం చేసుకోవాలని చెప్పినట్టు తెలిసింది. ప్రకటించాల్సిన మూడు స్థానాల్లో పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు ఉన్నాయి. టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా దక్కిన అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి గిడ్డి సత్యనారాయణను ఖరారు చేసింది. నిన్న ఆయనను మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి పిలిపించిన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేసుకోవాలని సూచించారు.

తిరుపతి అసెంబ్లీ స్థానంలో విషయంలో చిక్కుముడి వీడడం లేదు. జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఆయన స్థానికేతరుడు కావడంతో బీజేపీ, టీడీపీ నుంచి ఆయనకు సహకారం అందడం లేదు. ఆ స్థానాన్ని హరిప్రసాద్, కిరణ్ రాయల్, టీడీపీ నుంచి మరో ఇద్దరు నాయకులు జనసేన నుంచి టికెట్ ఆశిస్తున్నారు. సీటు ఇస్తే కనుక పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మచిలీపట్టణం ఎంపీ స్థానం బాలశౌరికి దాదాపు ఖరారైనట్టు తెలిసింది. అయితే, ఆయనను అవనిగడ్డ నుంచి బరిలోకి దింపే యోచనలో పార్టీ ఉన్నట్టు తెలిసింది.

జనసేన ప్రకటించిన అభ్యర్థులు వీరే 
పిఠాపురం: పవన్ కల్యాణ్
తెనాలి: నాదెండ్ల మనోహర్
నిడదవోలు: కందుల దుర్గేశ్
అనకాపల్లి: కొణతాల రామకృష్ణ
నెల్లిమర్ల: లోకం మాధవి
కాకినాడ రూరల్: పంతం నానాజీ
రాజానగరం: బత్తుల బలరామకృష్ణ

తాజాగా ఖారారైన 11 స్థానాలు
పెందుర్తి: పంచకర్ల రమేశ్
యలమంచిలి: సుందరపు విజయకుమార్
విశాఖపట్టణం దక్షిణం: వంశీకృష్ణ యాదవ్
తాడేపల్లిగూడెం: బొల్లిశెట్టి శ్రీనివాస్
భీమవరం: పులపర్తి ఆంజనేయులు
నరసాపురం: బొమ్మిడి నాయకర్
ఉంగుటూరు: పత్సమట్ల ధర్మరాజు
రాజోలు: దేవ వరప్రసాద్
తిరుపతి: ఆరణి శ్రీనివాసులు
పి.గన్నవరం: గిడ్డి సత్యానారాయణ
పోలవరం: చిర్రి బాలరాజు

Related posts

వైఎస్సార్ తెలంగాణ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై మాణిక్కం ఠాగూర్ స్పందన 

Ram Narayana

పెనమలూరులో చంద్రబాబు పోటీ చేసినా గెలుపు నాదే: జోగి రమేశ్

Ram Narayana

చంద్రబాబు అరెస్ట్ ఆయన గొప్పతనాన్ని బయటపెట్టింది …భువనేశ్వరి

Ram Narayana

Leave a Comment