Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
హైకోర్టు వార్తలు

హిందూ వివాహంలో కన్యాదానం తప్పనిసరి కాదు.. అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు…

  • పెళ్లికి సప్తపది ప్రక్రియ ముఖ్యమని తేల్చిచెప్పిన న్యాయస్థానం
  • కన్యాదానం కేవలం పెళ్లిలో ఒక వేడుక మాత్రమేనని వ్యాఖ్య 
  • ఓ రివిజన్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు

హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి వేడుకల్లో కన్యాదానం నిర్వహించడం తప్పనిసరికాదని అలహాబాద్ హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ‘సప్తపది’ మాత్రం పెళ్లిలో ముఖ్యమైన వేడుక అని స్పష్టం చేసింది. న్యాయమైన నిర్ణయం తీసుకునేందుకు కన్యాదానం జరిగిందా లేదా అనేది పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదని కోర్టు వ్యాఖ్యానించింది.

ఆశ్‌తోశ్ యాదవ్ అనే ఓ వ్యక్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ సుభాశ్ విద్యార్థి నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు మార్చి 22న జారీ చేసిన ఉత్తర్వులో హైకోర్ట్ పేర్కొంది. హిందూ వివాహ ప్రక్రియలో కన్యాదానం కేవలం ఒక వేడుక మాత్రమేనని తెలిపింది.

అత్తంటి వారు పెట్టిన కేసు విషయంలో మార్చి 6న లక్నో అదనపు సెషన్స్ కోర్టు జడ్జి జారీ చేసిన ఉత్తర్వులను పిటిషనర్ అలహాబాద్ హైకోర్టులో సవాలు చేశారు. అయితే వివాహ రుజువు కోసం హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 311 సీఆర్‌పీసీ కింద సాక్షులను కోర్టుకు పిలవలేమని కోర్టు స్పష్టం చేసింది. న్యాయమైన నిర్ణయం తీసుకోవడానికి కన్యాదానం జరిగిందా? లేదా? అనేది ముఖ్యంకాదని పేర్కొంది.

Related posts

అలా అయితే భారత్ నుంచి నిష్క్రమిస్తాం.. ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ స్పష్టీకరణ…

Ram Narayana

అరుదైన ఘట్టానికి వేదికైన తెలంగాణ హైకోర్టు

Ram Narayana

కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు

Ram Narayana

Leave a Comment