- కాన్వాయ్‌లోని ల్యాండ్ క్రూయిజర్ కారు టైర్ పంక్చర్
- సడెన్‌గా ఆగిపోయిన కారు… ఉలిక్కిపడ్డ పోలీసులు
- ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు
- రేవంత్ రెడ్డి కొడంగల్ వెళుతుండగా ఘటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని ల్యాండ్ క్రూయిజర్ కారు టైర్ పంక్చర్ అయి పేలింది. కారు సడెన్‌గా ఆగింది. దీంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆయన కొడంగల్‌లో మండలాలవారీగా కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. ఇందుకోసం ఆయన కొడంగల్ వెళ్తున్న సమయంలో వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద కారు టైర్ పంక్చర్ అయింది. కాన్వాయ్‌లోని వారికి ఎవరికీ ఏమీ కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: