Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

లోక్ సభ ఎన్నికలు… మహారాష్ట్రలో కీలక ప్రకటన చేసిన రాజ్ ఠాక్రే

  • బీజేపీ కూటమికి షరతుల్లేని మద్దతు ప్రకటించిన రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్
  • లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిస్తున్నట్లు వెల్లడి
  • గత నెలలో అమిత్ షా, దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన రాజ్ ఠాక్రే, తనయుడు అమిత్ ఠాక్రే

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన మంగళవారం కీలక ప్రకటన చేసింది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి షరతుల్లేని మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎంఎన్ఎస్ తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా ప్రకటన చేసింది. గత నెలలో రాజ్ ఠాక్రే, తనయుడు అమిత్ ఠాక్రే కేంద్రమంత్రి అమిత్ షాను కలిశారు. అంతకుముందు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశారు.

ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు

మహారాష్ట్రలో ఇండియా కూటమి సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్దవ్ ఠాక్రే శివసేన సంయుక్త ప్రకటన చేశాయి. మహారాష్ట్రలో 48 లోక్ సభ స్థానాలు ఉండగా ఉద్దవ్ ఠాక్రే వర్గం శివసేన 21 స్థానాల్లో, కాంగ్రెస్ 17 స్థానాల్లో, శరద్ పవార్ ఎన్సీపీ 10 సీట్లలో పోటీ చేయనున్నాయి. మహారాష్ట్రలో ఐదు దశల్లో ఏప్రిల్ 19 నుంచి మే 20 వరకు పోలింగ్ జరగనుంది.

Related posts

స్మృతి ఇరానీ నుంచి రాజీవ్ చంద్రశేఖర్‌ వరకు ఓడిపోయిన కేంద్రమంత్రులు వీరే!

Ram Narayana

కాంగ్రెస్‌తో పర్మినెంట్ పెళ్లేమీ కాలేదు!: పొత్తుపై అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్య…

Ram Narayana

వయనాడ్ ఉపఎన్నిక.. బరిలో ప్రియాంక గాంధీ?

Ram Narayana

Leave a Comment