- అనంత్ నాగ్ రాజౌరి స్థానం నుంచి పోటీ చేయాలని భావించిన ఆజాద్
- అంతలోనే ఆజాద్ పోటీ చేయడం లేదని ప్రకటించిన పార్టీ
- అనంత్ నాగ్ నుంచి పీడీపీ తరఫున పోటీ చేస్తున్న మెహబూబా ముఫ్తీ
డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత, కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ మేరకు ఆ పార్టీ బుధవారం ప్రకటించింది. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్ నాగ్-రాజౌరి స్థానం నుంచి ఆజాద్ పోటీ చేయాలని భావించారు. అయితే అంతలోనే ఆయన తప్పుకున్నట్లు పార్టీ ప్రకటించింది. అనంత్ నాగ్ నుంచి పీడీపీ తరఫున మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి తరఫున నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత అల్తాఫ్ అహ్మద్ బరిలో నిలిచారు.