బీజేపీ కార్యకర్తగా సేవ చేయడమే తన లక్ష్యం … డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి
దేశ హితం కోసమే బీజేపీ పనిచేస్తుంది …
అందుకే 400 సీట్లు లక్ష్యంగా పనిచేస్తున్నాం
రాజ్యాంగాన్ని మార్చుతున్నామనేది తప్పుడు ప్రచారం
రాహుల్ , శ్యామ్ పిట్రోడా కన్ఫ్యూజన్ రాజకీయాలు చేస్తున్నారు
తమిళనాడు అంతటా ప్రతి ఇంట్లో మోడీ నినాదం చేరింది …
మోడీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు
ఖమ్మం జిల్లాలో ధనస్వామ్యం వర్దిల్లుతుంది
ఖమ్మం సమగ్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం
ప్రజలకు అండగా ఉండాలనే లక్ష్యంతోనే కార్యకర్తలు పనిచేస్తున్నారు ..
ఖమ్మంలో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి అనేక సంఘసేవా కార్యక్రమాలు చేశారు

నిబద్ధతకు ఆయన మారుపేరు …మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ లో క్రియాశీలంగా వ్యవహరించిన డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి బీజేపీలో చేరిన దగ్గర నుంచి విసుగు విరామం లేకుండా పార్టీ తనకు అప్పగించిన పనిని చేస్తున్నారు … బీజేపీ కార్యకర్తగా పార్టీకి సేవచేయడమే తన లక్ష్యం అంటున్నారు …మోడీ మార్గదర్శకత్వంలో దేశ హితం కోసం పనిచేస్తున్న బీజేపీలో మంచి కంఫర్ట్ గా ఉన్నానని పదవులు అనేవి వచ్చే రోజున అవే వస్తాయని వాటికోసం ఎదురు చూడటంలేదని తన అభిప్రాయాలను “దృక్పధం “తో పంచుకున్నారు …ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన పొంగులేటిని పలకరించగా అనేక విషయాలపై పార్టీ వైఖరిని వివరించారు …
పొంగులేటి సుధాకర్ రెడ్డి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు లేరు …విద్యార్ధి , యువజన రాజకీయాల్లో ఆయన అనేకమంది నేతలను తయారు చేశారు …గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జిగా ఉన్నప్పడే , గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీ , రాజకీయాల్లో అపర చాణిక్యుడుగా పేరొందిన అమిత్ షా దృష్టిలో పడ్డారు …తరవాత ఆయన మోడీ పిలుపు మేరకు బీజేపీ లో చేరారు …ఇప్పుడు ఆయన బీజేపీ జాతీయ నేతగా తమిళనాడు ,కర్ణాటక కో – ఇంఛార్జిగా , తెలంగాణ కోర్ కమిటీ సభ్యునిగా సేవలందిస్తున్నారు …తమిళనాడులో ఎన్నికలు పూర్తీ అవ్వగా ఇంకా కర్ణాటకలో మరో 14 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది …ఆరాష్ట్రాల ఇంఛార్జిగా తీరిక లేకుండా ఉంటూనే సమయం దొరికినప్పుడల్లా ఖమ్మం వచ్చి బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఎన్నికల ప్రచారం లో పాల్గొంటుంటూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు …
ఎన్డీయే కు 400 సీట్లు ఖాయం ….బీజేపీకి 370 పైగానే …
ఎన్డీయే కు 400 సీట్లు ఖాయంగా వస్తాయని …బీజేపీకి 370 గ్యారంటీ అన్నారు …దేశంలో మోడీ హవా నడుస్తుందని అందుకే బీజేపీకి ప్రజల నుంచి మద్దతు పెరిగిందని అభిప్రాయపడ్డారు …మూడవసారి మోడీ ప్రధాని కావడం ఖాయమని అన్నారు …
ఇండియా కూటమి కలగూర గంప …
ఒక పక్క మోడీ మరో పక్క కలగూర గంపగా ఉన్న ఇండియా కూటమి …విచిత్రమైన పొత్తులు …కూటమిలో ఉన్న కమ్యూనిస్టులు -కాంగ్రెస్ పార్టీలు దేశమంతా పొత్తులు అంటూ కేరళలో మాత్రం విడిపోయి పోటీ చేస్తున్నాయని ఇదేమి సిద్ధాంతమో అర్ధం కావడంలేదని ,మొదట కూటమిలో చేరిన అనేక మంది బయటకు వెళ్లిపోయారని అన్నారు …
మోడీ నాయకత్వంలో పెరిగిన దేశ ప్రతిష్ట …
మోడీ నాయకత్వంలో దేశ ప్రతిష్ట దేశ విదేశాల్లో పెరిగిందని ఒకప్పుడు మనదేశమంటే పట్టించుకొనే అనేక దేశాలు మోడీకి ఆహ్వానాలు పలుకుతున్నాయని …మాకు మార్గ నిర్దేశం చేయమని కోరుతున్నాయని సుధాకర్ రెడ్డి అన్నారు ..బలమైన ఆర్థిక వ్యవస్థగా దేశం ఎదగటానికి , మేక్ ఇన్ ఇండియా , మేడ్ ఇన్ ఇండియా నినాదం పనిచేసిందని అన్నారు ..పొరుగు దేశాలైన పాక్ , చైనాను హద్దుల్లో పెట్టగలిగామని అన్నారు …ఒకప్పుడు భారత్ అనే లెక్కలేని తనం ఉండేదని నేడు భారత్ కు ప్రపంచంలో పెరుగుతున్న ఆదరణకు మోడీ విధానాలే కారణమని పేర్కొన్నారు ..
కాంగ్రెస్ కన్ఫ్యూజన్ రాజకీయాలు
అనేక వనరులు ఉండి దేశంలో సిరిసంపదలతో తుగాల్సిన భారత్ కాంగ్రెస్ అవినీతి ,అక్రమ రాజకీయ విధానాల వలన కుంటుపడిందని పొంగులేటి విశ్లేషించారు .. రాహుల్ , శ్యామ్ పిట్రోడా లాంటి వారు కన్ఫ్యూజన్ రాజకీయాలు చేస్తున్నారని లేనిపోని అబద్దాలు,విషపూరిత రాజకీయాలు విభజన రాజకీయాలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ విధానాలపై మండిపడ్డారు …
బీజేపీ రాజ్యాంగాన్ని మార్చుతుందనేది తప్పుడు ప్రచారం ….
బీజేపీ తిరిగి బంపర్ మెజార్టీ తో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నిమార్చుతారని ,రిజర్వేషన్లు ఎత్తి వేస్తారని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని , ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగత్ కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని కొట్టి పారేశారని గుర్తు చేశారు ..జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు , త్రీబుల్ తలాక్ ,రామమందిర నిర్మాణం ప్రజల ఆమోదంతో చేశామని అన్నారు …అసలు రాజ్యాంగాన్ని అవమాన పర్చింది కాంగ్రెస్ అనే ఆరోపించారు …ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెపుతారని పొంగులేటి అన్నారు …అందుకే కాంగ్రెస్ పేరు ఇండియన్ నేషనల్ కరప్షన్ కాంగ్రెస్ అని కొత్త పేరు వచ్చిందని అన్నారు ..
తెలంగాణాలో కార్ షడ్డుకు ..అలవి కానీ వాగ్దానాలతో కాంగ్రెస్
తెలంగాణాలో భవిషత్ బీజేపీదేనని ఇప్పటికే కార్ షడ్డుకు పోగా , అలవి కానీ వాగ్దానాలతో కాంగ్రెస్ కొట్టు మిట్టాడుతుందని అందువల్ల భవిషత్ బీజేపీదేనని పొంగులేటి అభిప్రాయపడ్డారు …పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్రంలో డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు …అదే విధంగా కర్ణాటకలో 23 సీట్లు , తమిళనాడులో మంచి ఓటింగ్ వస్తుందని అన్నారు …
ఖమ్మంలో ధనస్వామ్యం
ఖమ్మంలో పోటీలో ఉన్న కాంగ్రెస్ , బీఆర్ యస్ అభ్యర్థులు ఇరువురు ధనవంతులని అందువల్ల ధనస్వామ్యం వర్థిల్లుతుందని చెప్పుకొచ్చారు …అయితే తమకు గతంలో కంటే మంచి ఫలితం వస్తుందని అన్నారు …అభ్యర్థి పర్యటనల్లో కూడా ప్రజల నుంచి మార్పు కనిపిస్తుందని అన్నారు …ఫలితం తమకు ఆశాజనకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు …ఖమ్మం సమగ్రాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని , ప్రజలకు అండగా ఉంటామని తమ అభ్యర్థి వినోద్ రావు ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా అనేక సేవ కార్యక్రమాలు చేశారని మంచి వాడైనా వినోద్ రావుకు అండగా ఉండాలని ప్రజలను పొంగులేటి కోరారు …

Dr. Ponguleti Sudhakar Reddy’s goal is to serve as a BJP worker
BJP works for the interest of the country.
That is why we are working on the target of 400 seats
It is a false propaganda that the constitution is being changed
Rahul and Shyam Pitroda are doing politics of confusion
Modi slogan reached every house across Tamil Nadu…
People want Modi
Wealth flourishes in Khammam district
Comprehensive development of Khammam is possible only with BJP
Activists are working with the aim of supporting the people.
The BJP candidate who is contesting in Khamma has done many community service activities
His nickname for commitment… Dr. Ponguleti Sudhakar Reddy, who has been active in Congress for three decades, has been doing the work assigned to him by the party without a break since he joined the BJP… He says his aim is to serve the party as a BJP activist… Working for the interest of the country under the guidance of Modi, he feels good in the BJP. He shared his views with “Drkpadham” that he is not waiting for the posts to come the next day.
Ponguleti Sudhakar Reddy means there is no one who does not know this name in Telugu states…He has made many leaders in student and youth politics…In charge of Congress party in Gujarat, Narendra Modi, who is the CM of Gujarat, Amit Shah who is known as Apara Chanikya in politics came to the attention… Later he joined BJP on Modi’s call…Now he is serving as BJP national leader, Tamil Nadu, Karnataka co-in-charge and Telangana core committee member… Elections are over in Tamil Nadu and still elections for 14 more seats are to be held in Karnataka… He is busy in charge of states. Whenever there is time to stay, Tandra Vinod Rao, BJP’s Khammam parliamentary candidate comes to Khammam and participates in the election campaign, filling the workers with enthusiasm…
400 seats are assured for NDA….More than 370 for BJP…
He said that NDA will get 400 seats for sure… 370 seats are guaranteed for BJP… He believes that the Modi air is running in the country and hence the support of BJP has increased from the people… He said that it is certain that Modi will become the Prime Minister for the third time…
India Alliance Kalagura Gampa …
India alliance with Modi on one side and Kalagura on the other side…strange alliances…Communists in the alliance – Congress parties in the alliance say that they are an alliance all over the country but in Kerala they are competing separately.
The prestige of the country increased under Modi’s leadership.

Sudhakar Reddy said that under the leadership of Modi, the prestige of the country has increased abroad, many countries that once cared about our country are inviting Modi… and asking him to guide us. He said that he was able to keep China within limits… Once there was an incalculable entity called India, and today it is Modi’s policies that are the reason for India’s growing popularity in the world.
Politics of Congress Confusion
Ponguleti analyzed that India’s Congress, which has many resources and should be swept away with riches in the country, has been crippled by corruption and illegal political policies.. People like Rahul and Shyam Pitroda are doing politics of confusion and they are spreading lies, poisonous politics and politics of division.
BJP will change the constitution is a false propaganda.
He reminded that the opposition is spreading false propaganda that if the BJP comes back to power with a bumper majority, they will change the constitution and remove reservations, RSS chief Mohan Bhagat has also dismissed this false propaganda. …He accused the Congress of insulting the original constitution…Ponguleti said that the people will teach a lesson to the Congress which is doing vote bank politics…That is why the name of the Congress is Indian National Corruption Congress..
Car Shaddu in Telangana ..Alavi but Congress with promises
Ponguleti opined that the BJP is the future in Telangana as the car has already gone to waste, but the Congress will continue to keep its promises and therefore the BJP is the future.
Wealth in Khamma
Congress and BRS candidates who are contesting in Khammam said that because both are rich, wealth will flourish…However, they said that they will get better results than before…They said that they will see a change from the people during the candidate’s visits…They believe that the result will be promising for them…BJP for comprehensive development of Khammam. He said that his candidate Vinod Rao has done many service programs through the Ekalavya Foundation that he is committed and will stand by the people.