నామ గెలుపు ఖాయం ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది …”దృక్పధం” తో మాజీమంత్రి
పువ్వాడ…
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే మా ప్రచార అస్త్రాలు
కేసీఆర్ ను ఓడించినందుకు ప్రజలు భాదపడుతున్నారు
ఖమ్మంలో ఎప్పుడు నామకే ఆధిక్యం …
నామ గెలుపు ఖాయం ఇందులో ఎలాంటి సందేహాలు అసరంలేదని మాజీ మంత్రి బీఆర్ యస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు …శనివారం “దృక్పధం” ఆయన్ను పలకరించగా అనేక విషయాలను పంచుకున్నారు …అసెంబ్లీ ఎన్నికల నాటికీ నేటికీ ప్రజల్లో కచ్చితమైన తేడా కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు …కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అలవికాని అనేక వాగ్దానాలు ఇచ్చింది …వాటిని నెరవేర్చేందుకు పిల్లి మొగ్గలు వేస్తుంది …అనేక విషయాల్లో బీఆర్ యస్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసేందుకు ప్రయత్నిస్తుంది …కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో వారు చేసిన ప్రయత్నాలు చూశాం …శాసనసభలో శ్వేతపత్రాలపేరుతో కొన్ని రోజులు డ్రామాలు ఆడారు …తరువాత మరొకటి …ఆయన మా శాసనసభ్యులు అడిగిన దానికి ప్రభుత్వం నుంచి సరైన సమాదానాలు లేవని అన్నారు…
ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు అన్నారు …తీరా వాటి అమలు అస్తవ్యస్తంగా ఉంది …కొద్దిరోజుల్లోనే వారి బండారం బయటపడింది …దీంతో ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలనే ఆలోచనకు ప్రజలు వచ్చారని అన్నారు …వారి వాగ్దానాల్లో ప్రతిమహిళకు నెలకు రూ 2500 ఇస్తామన్నారు …4 వేల రూపాయల పెన్షన్ అన్నారు …రైతులకు 2 లక్షల రుణమాఫీ అధికారంలోకి రాగానే ఇస్తామన్నారు …రైతు బంధు ఎకరాకు 15 వేలు అన్నారు …తమ ప్రభుత్వం ఇచ్చిన ఎకరాకు 10 వేలు ఇవ్వలేక మీనమేషాలు లెక్కపెడుతున్నారు ..దాన్ని ఆపేందుకు సాకులు వెతుకుతున్నారు …
తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒక్క నిమిషం కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగలేదు …ఇప్పుడు నిరంతరం ఆటంకం ఏర్పడుతుందని వార్తలు వస్తున్నాయి…దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది …ఇంత తొందరగా ప్రజల్లో వ్యతిరేకత రావడం ఆశ్చర్యంగా ఉంది …
కేసీఆర్ ను ఓడించినందుకు ప్రజలు భాదపడుతున్నారు …
కొద్దీ రోజుల్లోనే ప్రజల అవగాహనలో తేడా వచ్చింది ….కేసీఆర్ ను ఓడించినందుకు భాదపడుతున్నారు …ప్రజలకు మనకే సంక్షమే పథకాలు అమలు చేయడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టించారు …తెలంగాణ వచ్చినతర్వాత రాక ముందు అభివృద్ధితో పోల్చుకుంటున్నారు…హైద్రాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ యస్ దే…బీఆర్ యస్ ఓడిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అయింది …కరెంటు కష్టాలు వచ్చాయి …అనేక పథకాలు ఆగిపోయాయి…మంచినీళ్లు దొరకని పరిస్థితి ..మళ్ళీ ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకుంటున్నారు …పంపుల దగ్గర మహిళలు బిందెలతో కొట్టుకుంటున్నారు …దీంతో ప్రజలు ఇసుగు చెందారు …అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు …లోకసభ ఎన్నికల్లో కచ్చితంగా అది కనిపిస్తుందని పువ్వాడ విశ్వాసం వ్యక్తం చేశారు …
నామ గెలుపు గ్యారంటీ …
నామ గెలుపు ఎవరు ఆపలేరు …తమకు వస్తున్నా ఆదరణను బట్టి కచ్చితంగా గెలుస్తారు …ఖమ్మం అసెంబ్లీ నియోజకర్గంలో ఎంపీగా పోటీచేసిన నామకు ప్రతిసారి మెజార్టీ వచ్చింది ..ఈసారి కూడా ఖమ్మం నియోజకవర్గం మెజార్టీ వస్తుంది ….ఖమ్మంలో బీఆర్ యస్ నుంచి మేయర్ , కార్పొరేటర్లు పార్టీ మారినప్పటికీ ఆ ప్రభావం పెద్దగా పడదు … అందులో నామ ప్రలందరికి సుపరిచితులు …రెండు సార్లు ఎంపీగా చేశారు …సౌమ్యుడు అనే పేరుంది అని పువ్వాడ అజయ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు ….