Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు కొత్త ఎస్పీలు వీరే!

  • ఏపీలో పోలింగ్ రోజున, ఆ తర్వాత అల్లర్లు
  • పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు
  • తిరుపతి ఎస్పీ బదిలీ
  • పల్నాడు ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమ్ సాలి నియామకం
  • తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ నియామకం

ఎన్నికల హింస నేపథ్యంలో పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఎన్నికల సంఘం, తిరుపతి ఎస్పీని బదిలీ చేయడం తెలిసిందే. తాజాగా… ఈసీ ఈ మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది.

పల్నాడు జిల్లా ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి సాలి, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి పంపించిన అర్హులైన ఐపీఎస్ అధికారుల జాబితాను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Related posts

సోము వీర్రాజు శాసనమండలి సభ్యత్వం నేటితో పూర్తి..

Drukpadam

పిలవని పేరంటాలు… ఆహ్వానం లేకుండా అంబానీ పెళ్లికి వెళ్లిన ఇద్దరు ఏపీ యువకులపై కేసు

Ram Narayana

బీహార్ లో ప్రజల రక్తం రుచిమరిగిన బెంగాల్ టైగర్ …ఐదుగురి బలి…

Drukpadam

Leave a Comment