Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నందమూరి బాలకృష్ణ…

  • జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చిన బాలకృష్ణ
  • రేవంత్ రెడ్డితో సమావేశం
  • బాలయ్యతో పాటు రేవంత్ నివాసానికి వచ్చిన బసవతారకం ట్రస్టు సభ్యులు

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని  మర్యాదపూర్వకంగా  కలిశారు. హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన బాలకృష్ణ… పుష్పగుచ్ఛం అందించి సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి.

బాలయ్యతో పాటు రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చిన వారిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్టు సభ్యులు కూడా ఉన్నారు. కాగా, బాలకృష్ణ, రేవంత్ మధ్య సమావేశంలో ఏపీ రాజకీయాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. 

రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక గత డిసెంబరులోనూ బాలయ్య ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Related posts

షర్మిల కాంగ్రెస్ లో చేరతారా …?

Ram Narayana

 సంక్రాంతికి టీఎస్ఆర్‌టీసీ 4,484 ప్రత్యేక బస్సులు

Ram Narayana

షర్మిల, రేవంత్‌రెడ్డిని నడిపిస్తున్నది చంద్రబాబే: జగన్

Ram Narayana

Leave a Comment