Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

రాహుల్ గాంధీ వాయినాడ్ ను వదులుకోనున్నారా ….?

  • వయనాడ్ స్థానం వదులుకోవచ్చునని చెప్పకనే చెప్పిన సుధాకరన్
  • రాహుల్ గాంధీ వయనాడ్‌లోనే ఉండాలని ఆశించవద్దని వ్యాఖ్య
  • దేశానికి నాయకత్వం వహించాల్సిన నేతకు మనం మద్దతుగా ఉండాలని సూచన
  • జాతీయనేతగా రాహుల్ గాంధీ అవసరం యూపీలో ఉండనే అభిప్రాయాలు
  • కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోకసభ ఎన్నికల్లో యూపీలోని రాయబరేలి , కేరళలోని వాయినాడ్ రెండు చోట్ల పోటీచేసి గెలుపొందారు .. తప్పని పరిస్థితిల్లో ఏదోఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి ఉంది …దేన్నీ వదులుకోవాలని డైలమాలో రాహుల్ ఉన్నట్లు చర్చ జరుగుతుంది …ఈనేపథ్యంలో కేరళ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకరన్ రాహుల్ గాంధీ విస్తృత ప్రయోజనాల రీత్యా దేశానికి నాయకత్వం ప్రధానమని అందువల్ల ఆయన వాయినాడ్ లో ఉండాలని ఆశించవద్దని అనడం ఆయన వాయినాడ్ ను వదులుకుంటున్నారని చెప్పకనే చెప్పినట్లుగా ఉంది ..రాహుల్ రాయబరేలి అట్టిపెట్టుకునే అవకాశం ఉంది ..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్ స్థానాన్ని వదులుకునే అవకాశాలు ఉన్నాయని కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు కె.సుధాకరన్ హింట్ ఇచ్చారు. మలప్పురంలో బుధవారం రాహుల్ గాంధీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకరన్ మాట్లాడుతూ… దేశానికి నాయకత్వం వహించాల్సిన రాహుల్ గాంధీ వయనాడ్‌లోనే ఉండాలని ఆశించవద్దని పేర్కొన్నారు. ఇక్కడే ఉండనందుకు బాధపడవద్దని సూచించారు. ‘మనం బాధపడకూడదు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. మనం రాహుల్ గాంధీకి మన మద్దతు ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలీ… రెండు నియోజకవర్గాల నుంచి విజయం సాధించారు. అయితే ఆయన ఏదో ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి ఉంది. ఏ నియోజకవర్గం వదులుకోవాలనే అంశంపై రాహుల్ గాంధీ కూడా డైలమాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేరళ కాంగ్రెస్ చీఫ్ హింట్ ఇచ్చారు.

Related posts

తాను ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పిన ప్రియాంక గాంధీ..!

Ram Narayana

మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా!

Ram Narayana

ఇండియా కూటమిని నేనే ఏర్పాటు చేశా… నడపాల్సిన బాధ్యత నాపై ఉంది: మమతా బెనర్జీ

Ram Narayana

Leave a Comment