టికెట్ కొని పల్లెవెలుగు బస్సు లో డిప్యూటీ సీఎం భట్టి ప్రయాణం …
ఉచిత బస్సు ప్రయాణంపై మహిళల అభిప్రాయాలు తెలుసుకున్న భట్టి
ఉచిత విద్యుత్ పై అరా ..
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం నుంచి జగన్నాధపురం వరకు పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో టికెట్ కొని ప్రయాణం చేశారు … ఖమ్మం పాత బస్టాండ్ నుంచి చింతకాని మండలం జగన్నాధపురం వరకు సాగిన ఈ ప్రయాణంలో ప్రయాణికులను కుశల ప్రశ్నలు వేశారు ..ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మహాలక్ష్మి పథకం అమలవుతున్న వివరాలను ప్రయాణికులను పథకాల గురించి తెలుసుకున్నారు …ఆర్టీసీ ఉచిత ప్రయాణం చాలా బాగుందని , ఆర్థికంగా వెసులుబాటు అవుతుందని డిప్యూటీ సీఎం భట్టితో మహిళలు ఆనందం వ్యక్తం చేశారు …ఉచితంగా ప్రయాణం చేసే మహిళలకు జారీచేస్తున్న జీరో టికెట్ల విధానం గురించి కండక్టర్ శైలజను అడిగి తెలుసుకున్నారు …
నాగులవంచ గ్రామానికి చెందిన జానమ్మ అనంతమ్మతో ముచ్చటిస్తూ కరెంటు మంచిగా వస్తుందా? ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఎలా ఉంది? ఎన్నిసార్లు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు? బడి గుడి పెళ్లి పేరంటాలకు ఉచిత బస్సులు వెళ్లడం వల్ల ఆర్థికంగా కొంత పెసరబాటు అవుతున్నదని డిప్యూటీ సీఎంతో వెల్లడించిన మహిళలు
పల్లె వెలుగు బస్సులో మహాలక్ష్మితో కలిసి ప్రయాణించడం చాలా సంతోషంగా ఉందని భట్టి విక్రమార్క అన్నారు ..ఫ్రీ బస్సులు వాడుకుంటున్న మహిళలు చాలా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు .. మహిళలకు రాష్ట్రంలో ఉచిత ప్రయాణం అమలు చేయడం వల్ల ఆర్టీసీ బలోపేతం అవుతుందని , కొత్తగా 300 పైగా బస్సులు కొనుగోలు చేశారని . అంతేకాకుండా ఆర్టీసీ విస్తరణకు దోహదపడుతున్నదని అన్నారు .. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో ప్రయాణికుల సంఖ్య బస్సుల్లో పెరిగినందున కొత్త బస్సులు కావలసిన అవసరం ఏర్పడుతున్నదని అన్నారు ..
స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు రుణాలు ఇప్పించి వారితో బస్సులు కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీలో పెట్టాలన్న ఆలోచన చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపేర్కొన్నారు ..మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం మన్నారు …రాష్ట్రంలో 92 శాతం ఉన్న బలహీన వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వ పనితీరు ఉంటుందన్నారు .
ఖమ్మం పాత బస్టాండ్ లో పాతర్లపాడు గ్రామానికి వెళ్లేటువంటి ఆర్టీసీ బస్సును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కజెండా ఊపి ప్రారంభించారు ..కార్యక్రమంలో వైరా శాసనసభ్యులు రామదాసు, నాయక్ జిల్లా కలెక్టర్ గౌతం, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వెంకన్న తదితరులు