Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హైకోర్టు జడ్జిల పోస్టులకు సుప్రీంకోర్టు న్యాయవాదులను కూడా పరిగణనలోకి తీసుకోండి: సీజేఐ ఎన్వీ రమణ…

హైకోర్టు జడ్జిల పోస్టులకు సుప్రీంకోర్టు న్యాయవాదులను కూడా పరిగణనలోకి తీసుకోండి: సీజేఐ ఎన్వీ రమణ
హైకోర్టు జడ్జిల నియామకాలపై ఎస్ సీబీఏ ప్రతిపాదన
సుప్రీంకోర్టు న్యాయవాదులను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి
సానుకూలంగా స్పందించిన సీజేఐ రమణ
అన్ని హైకోర్టుల జడ్జిలకు సీజేఐ లేఖ

హైకోర్టు న్యాయమూర్తుల పోస్టుల భర్తీలో సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న సీనియర్ న్యాయవాదులను కూడా పరిగణనలోకి తీసుకునేలా చొరవ చూపాలని సీజేఐ ఎన్వీ రమణను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్ సీబీఏ) కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు.

ఈ క్రమంలో అన్ని హైకోర్టుల చీఫ్ జస్టిస్ లకు ఆయన లేఖ రాశారు. హైకోర్టు జడ్జిల నియామకాల వేళ సుప్రీంకోర్టు ప్రాక్టీసింగ్ న్యాయవాదులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని… వారి అనుభవాన్ని, నైపుణ్యాన్ని కూడా గుర్తించాలని సూచించారు. ఈ విషయాన్ని ఎస్ సీబీఏ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వెల్లడించారు.

హైకోర్టు జడ్జిలుగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులకు కూడా అవకాశం కల్పించాలన్న తమ ప్రతిపాదనపై జస్టిస్ ఎన్వీ రమణ సుముఖత వ్యక్తం చేశారని వికాస్ సింగ్ తెలిపారు. కాగా, సుప్రీంకోర్టులో చాలామంది మహిళా న్యాయవాదులు ఉన్నారని, వారందరూ వృత్తి రీత్యా ఉన్నత స్థాయికి ఎదగడం కోసం చూస్తున్నారని బార్ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు.

Related posts

తలకు మించిన అప్పులతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది : ఐఎంఎఫ్ చీఫ్!

Drukpadam

ర‌ఘురామ‌కృష్ణ‌రాజు విడుద‌ల‌ మరింత ఆలస్యం…

Drukpadam

ఎగుమతుల్లో దుమ్మురేపి రికార్డ్ సృష్టించిన భారత్.. చరిత్రలో ఇదే అత్యధికం!

Drukpadam

Leave a Comment