Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్‌ పాలకవర్గం ఏర్పాటు చేయాలి

రాజకీయ వాటా కల్పంచాలి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 250 కోట్లు విడుదల చేయాలి

కమ్యూనిహల్ కోసం స్థలం కేటాయించాలి

విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా 250 కోట్లు కేటాయించాలని స్థానిక తెలంగాణ రాష్ర్ట విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు అద్దంకి నాగేశ్వరావు డిమాండ్ చేశారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ ప్రెస్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాలకమండలని నియమించాలని లన్నారు . ఈ ఆర్ధిక సంవత్సరంలోనే 250 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా విశ్వబ్రాహ్మణలకు రావల్సిన రాజకీయ వాటా , నామినేట్ డ్ పదవులు ఆయిన యం.ఎల్.సి రాజ్య సభ సభ్యులుగా అర్హులైన విశ్వబ్రాహ్మణలకు నియమించాలన్నారు. అదే విధంగా ఖమ్మం నగరంలో కమ్యూనీటి హాల్ నిర్మాణం (ఆత్మ గౌరవ భవనం) కొరకు 2000 గణజుల ప్రభుత్వ స్థలమును కేటాయించి వారి అత్మ గౌరవం కాపాడాలన్నారు. తెలంగాణ రాష్ట్రం లో 22 లక్షల జనాభా, ఖమ్మం జిల్లాలో 35 వేల జనాభా, ఖమ్మం నగరంలో 12 వేల పై చిలుకు జనభా కలిగి ఉన్నామని వారిలో కమ్మరం , కంచరం , వడ్రంగం , శిలాళిల్పం మరియు స్వర్ణకార వృత్తులపై ఆధారవడి జీవనం కొనసాగిస్తున్న విశ్వబ్రాహ్మణులను ఈ ప్రభుత్వం గుర్తించాలన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు జరిగిన తొలి ఉద్యమం మొదలు మలి ఉద్యమం వరకు స్వరాష్ట్ర సిద్ధించే వరకు ముఖ్య మంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరావు తో పాటు వారి వెన్నంటి ఉద్యమంలో భాగస్వామ్య అయ్యామన్నారు. ఉద్యమానికి దశ దిశా నిర్దేశం చేసినటువంటి గౌరవనీయులు కీ.శే. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ మరియు కీ.శే. కాసోజు శ్రీ కాంతాచారితో పాటు 32 మంది బలిదానం చేసిన జాతి విశ్వబ్రాహ్మణ జాతి అన్నారు . ఈ రోజు వరకు కూడా విశ్వబ్రాహ్మణ జాతి మీతో మీ వెన్నంటి ఉన్నారని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు . గత సంవత్సరంలో షార్ట్ సర్కిల్ ఐ దూగోడు మిషన్లు భారీ నష్టం జరిగిందని వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు .విలేకర్ల సమావేశంలో కార్యదర్శి పెందోట సోమేశ్వర చారి , కోశాధికారి వెగ్గళం వెంకటేశ్వర్లు , స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు గౌరోజు వసంత్ బాబు , జిల్లా నాయకులు నందిగామ వీరబ్రహ్మచారి , దేశ రాజు వెంకటేశ్వర్లు , నగర కన్వీనర్ కొణపర్తి రాజేశ్వరరావు , జిల్లా నాయకులు మామిళ్ళపల్లి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు .

Related posts

నీళ్లే నిప్పులై పేలాయ్.. మూడు రోజులవుతున్నా ఆరని మంటలు.. బంగ్లాదేశ్!

Drukpadam

రష్యా గెలిచాకే యుద్ధం ఆగుతుంది..పుతిన్ సలహాదారు!

Drukpadam

This Dewy, Natural Makeup Routine Takes Less Than 5 Minutes

Drukpadam

Leave a Comment