Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పాత బస్ స్టాండ్ ఉద్యమం దుర్బుద్ధితో కూడుకున్నది … మంత్రి అజయ్

పాత బస్ స్టాండ్ ఉద్యమం దుర్బుద్ధితో కూడుకున్నది … మంత్రి అజయ్
పాత బస్టాండ్ స్థలంలో కల్యాణ మండపం
ఖమ్మం లోని పాత బస్టాండ్ కొనసాగింపు ఉద్యమం దుర్బుద్ధితో కూడుకున్నది … కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయనే ఉద్దేశం తో కొంతమంది కావాలని చేస్తున్నారు.దాన్ని ఎవరు పట్టించుకోవటం లేదు. స్థలం ఉంటుంది … అది ఎక్కడికి పోదు … దాన్ని కల్యాణ మండపం నిర్మించి సామాన్యులకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం … అని మంత్రి అజయ్ తెలిపారు . కొత్త బస్టాండ్ ప్రారంభోత్సవం కోసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 27 మంత్రి కేటీఆర్ చేతుల మీదగా కొత్త బస్టాండ్ ప్రారంభోత్సం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోనే అత్యంత ఆధునికరంగా నిర్మించి ప్రజలకు అందుబాటులో తేనున్నామని అన్నారు.మొత్తం 30 ప్లాట్ ఫారాలతో ఉన్న బస్టాండ్ లో ప్రయాణికులు దిగేందుకు ప్రత్యేకంగా 5 ప్లాట్ ఫారాలు ఉన్నాయన్నారు. రోజుకు 14 వందల బస్సు లు కొత్త బస్ స్టాండ్ నుంచి నడుస్తాయన్నారు.ప్లాట్ ఫారం లు కూడా పల్లెవెలుగు కు డీలక్స్ ,సూపర్ డీలక్స్ లకు, ప్రత్యేకంగా ఏర్పాటు ఉంటుందన్నారు. లెడ్ బల్బ్ లతో బోర్డులు , పబ్లిక్ అనౌన్స్ మెంట్ సిస్టం ఉంటుందని అన్నారు. కేటీఆర్ ఖమ్మం లో మరో ఐ టి హబ్ కు శంకుస్థాపన చేయనున్నారని అలాగే సత్తుపల్లిలో జరిగే కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారని అన్నారు. ఖమ్మం నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తన అన్ని అవకాశాలను వినియోగిస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ని అడిగిన వెంటనే ఖమ్మం నగరానికి 150 కోట్లు అందించారని కృతఙతలు తెలియజేశారు. ఆ నిధులతో ఖమ్మం ను మరింత సుందరీకరణ చేసేందుకు ఉపయోగిస్తామన్నారు.

Related posts

సాగర్ లో బీజేపీ ప్రయోగం సక్సెస్ అవుతుందా… ?

Drukpadam

ఏపీ లో వలంటీర్ల వ్యవస్థపై కౌంటర్ ఎన్ కౌంటర్… పవన్ వర్సెస్ జగన్

Drukpadam

2024 ఎన్నికలతో ఈ ఫలితాలకు సంబంధంలేదన్న మమతా బెనర్జీ!

Drukpadam

Leave a Comment