త్యాగానికి ప్రతీక బక్రీద్…మాజీఎంపీ నామ
రుగ్మతలను వీడి,సన్మార్గంలో నడుద్ధాం
ఇబ్రహీం త్యాగనిరతిని స్పూర్తిగా తీసుకుందాం
స్వార్ధాన్ని వదలి మానవత్వంతో బతుకుదాం
ముస్లిం సోదరసోదరీ మణులందరికీ బక్రీద్ శుభా కాంక్షలు తెలిపిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు
త్యాగం, క్షమ, ధర్మం, నిబద్దతకు ప్రతీకగా భావించే బక్రీద్ ( ఈద్ ఉల్ ఆద్హా ) పండుగని అత్యంత భక్తి శ్రద్దలు, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఆకాం క్షించారు. .పవిత్ర బక్రీద్ పండుగను పురష్కరించుకుని ఆయన ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఆదివారం ఒక ప్రకటనలో పండుగ శుభాకాంక్షలు తెలిపారు. స్వార్ధం, అసూయ, రాగ ద్వేషాలు వదిలేసి, మానవత్వాన్ని ఎదజల్లడమే బక్రీద్ పండుగ ఉద్ధేశాలని అన్నారు.ఈ పండగ దయాగుణాన్ని, దాన గుణాన్ని చాటిచెబుతూ ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. అల్లా ఆశీస్సులతో కుటుంబాల్లోని కలతలు, కష్టాలు, నష్టాలు తొలగిపోయి సుఖవంతమైన జీవితాన్ని గడపాలని అన్నారు. జాతి ,మత ,బీద గొప్ప అనే బేధాలను విడనాడి, ప్రేమానురాగాలను పెంపొందించి, ఆత్మీయతకు, ఆదరణకు ప్రతీకగా నిలిచేదే బక్రీద్ పండుగ అన్నారు. సమాజాన్ని సన్మార్గంలో నడిపించడం కోసం , నమ్మిన సిద్దాంతాల కోసం కన్న పేగు బంధాన్ని సైతం బలిచ్చేందుకు సిద్దమైన అజ్రత్ ఇబ్రహీం త్యాగనిరతిని స్పూర్తిగా తీసుకుని, సాటివారి కష్టాలను సామాజికంగా పంచుకుందా మని నామ అన్నారు. సమిష్టిగా ఒకరినొకరు సహకరించు కుందామని అన్నారు. ఎంతో విశిష్టత ఉన్న ఈ పండుగ మానవాళీలో ఎంతో ఐక్యతను నింపుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈర్ష్యాద్వేషాలు విడనాడి, శాంతి సామరస్యం ,స్నేహం, ప్రేమతో ఒకరినొకరు జీవిద్దామని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.