తెలంగాణ పీసీసీ ఫీఠంపై పీటముడి ..నాయకులమధ్య కుదరని ఏకాభిప్రాయం…
కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదా
పరస్పర అంగీకారం అనంతరమే అధ్యక్షుడి నియామకం
రేసులో మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీ, ఇతర నేతలు
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకంపై నాయకులమధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాయిదా పడింది …ఢిల్లీలో పీసీసీ అధ్యక్షుడిని నియామకంపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే , కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ , కేసి వేణుగోపాల్ , సమక్షంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకులు తలా ఒకమాట చెప్పడంతో అధిష్టానం నిర్ణయానికి రాలేకపోయింది …దీంతో దీన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు …అయితే చాలామంది తమకు పీసీసీ కావాలని పట్టు పడుతున్నట్లు సమాచారం …ముందుగా బీసీలకు పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్న ఏఐసీసీ పార్టీలో ముఖ్యనేతలుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ , మధు యాష్కీ పేర్లను పరిశీలించింది …అయితే మరి కొందరు కూడా ఆశించడంతో ఎవరిని చేస్తే పార్టీకి ఉపయోగం అనే దానిలో పార్టీ పెద్దలు తనమునకలైయ్యారు …డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మల్లు , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , సీతక్క లు కూడా తమకు పీసీసీ ఇవ్వాలనే అధిష్టానం పెద్దలవద్ద ప్రతిపాదనలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది …వీరే కాకుండా మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ , ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ లాంటి వారు కూడా పీసీసీ కలవని అధిష్టానం వద్ద పావులు కదుపుతున్నట్లు సమాచారం …
కొత్త అధ్యక్షుడి నియామకంలో పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎంపిక ప్రక్రియను ఏఐసీసీ వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై వారం రోజుల్లో మరోసారి చర్చించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ అగ్రనేతల పరస్పర అంగీకారం అనంతరం టీపీసీసీ అధ్యక్షుడిని నియమించనున్నారు.
పీసీసీ పదవి కోసం మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఎంపీలు బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క కూడా ఈ పదవి కోసం అధిష్ఠానం వద్ద అడుగుతున్నారని సమాచారం.