Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కోట్ల రూపాయల ఆశచూపిన కాంగ్రెస్ పార్టీ నుండి మారలేదు…మంత్రి సీతక్క

నేను పోరాటాల నుంచి వచ్చాను …నన్ను పార్టీమారాలని అందుకు కోట్ల రూపాయలు ఇస్తామని ఆశచూపారు …అయినా మారలేదు ..నేను నక్సలైట్ ఉద్యమంలోకి పోతానని అనుకోలేదు …పోయాను …మంత్రి అవుతానని అనుకోలేదు …అయ్యాను …గొండులకు అవకాశం రాలేదు …నాకు వచ్చింది …ప్రజలకు సేవచేస్తున్నారు …నన్ను దెబ్బకొట్టాలని , కించపరచాలని చేస్తున్నారు …సోషల్ మీడియా లో పోస్టింగులు పెడుతున్నారు …ఇదేనా మీ సంస్కారం …ఇలాంటి వాటిని ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఖండించాలి అని మంత్రి సీతక్క అన్నారు ..తనపై వస్తున్నా పోస్టింగ్ లపై ఆమె స్పందించారు …

నేను చదువుకుంటున్న రోజుల్లో నక్సలైట్ అవుతానని అనుకోలేదు. విప్లవ ఉద్యమం నుంచి ఇవాళ ప్రజాసేవలో ఉన్నాను. పేదలను అసహ్యించుకునే వాళ్లు రాజకీయాల్లో ఎక్కువగా ఉన్నారు. పేదరిక నిర్మూలన జరిగితేనే నా లక్ష్యం నెరవేరినట్టు. తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగానే రాష్ట్రం ఏర్పడింది. రాజకీయ నేతలు తప్పులు చేస్తే మేధావివర్గం తట్టి చెప్పడానికి ముందుకు రావాలి. రాజకీయంగా నన్ను ఎదుర్కొనే సత్తాలేక వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. నన్ను దెబ్బకొట్టాలని పదేపదే దుష్ప్రచారాలు చేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు పంపించా. రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి గోండులకు అవకాశం రాలేదు, ఎవ్వరూ మంత్రి కాలేదు. నాకు ఆ పదవి వస్తే బీఆర్ఎస్ వాళ్లు ఓర్వటం లేదు. నా ఉద్యమ జీవితాన్ని కూడా కించపరిచే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కోట్ల రూపాయలు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చినా నేను కాంగ్రెస్‌ను వీడలేదు” అని మంత్రి సీతక్క చెప్పారు.

Related posts

ఎన్నికల్లో మనతో ఉన్నోడే మనోడు…అవకాశవాదులు పార్టీలో స్థానంలేదు…సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

అధైర్య పడవద్దకు …కార్యకర్తలకు నాయకులకు కేటీఆర్ ఉద్బోధ

Ram Narayana

కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Ram Narayana

Leave a Comment