Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

సమీపిస్తున్న ఐటీఆర్ ఫైలింగ్ గడువు.. ఆలస్యమైతే ఏం జరుగుతుంది?

  • జులై 31, 2024 వరకు ఐటీఆర్ దాఖలుకు గడువు
  • గడువు దాటితే జరిమానాతో ఈ ఏడాది చివరి వరకు అవకాశం
  • ఆదాయాన్ని బట్టి జరిమానా విధించనున్న ఆదాయ పన్ను విభాగం

ఆర్థిక సంవత్సరం 2023-24కు (మదింపు ఏడాది 2024-25) సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్)-2024 దాఖలుకు గడువు సమీపిస్తోంది. జులై 31 చివరి తేదీగా ఉంది. డెడ్‌లైన్‌లోగా ఐటీఆర్ ఫైలింగ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే గడువు తేదీ తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే చెల్లింపుదారులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జరిమానా ఎంతనేది ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. జరిమానాతో డిసెంబర్ 31, 2024 వరకు ఐటీఆర్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది.

జరిమానా ఎవరికి ఎంత ఉంటుంది?
ఆర్థిక సంవత్సరం 2023-24కు (మదింపు ఏడాది2024-25) సంబంధించి నికర పన్ను విధించాల్సిన ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే చెల్లింపుదారులు రూ.5000 జరిమానా విధించి ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. నికర పన్ను విధించాల్సిన ఆదాయం రూ. 5 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉంటే మాత్రం ఆలస్య ఐటీఆర్‌పై చెల్లింపుదారులు రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 

కాగా పన్ను విధించదగిన ఆదాయం బేసిక్ మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉన్న వ్యక్తులు, కేవలం రీఫండ్‌ క్లెయిమ్ కోసం ఐటీఆర్ దాఖలు చేసేవారు ఎలాంటి ఆలస్య జరిమానా చెల్లించాల్సి అవసరం ఉండదని ఆదాయ పన్ను విభాగం నిబంధనలు చెబుతున్నాయి.

కాగా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడం తప్పనిసరి అని ఆదాయ పన్ను విభాగం నిబంధలను చెబుతున్నాయి. లేదంటే చెల్లింపుదారులు జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు అవసరమైతే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే సకాలంలో బాధ్యత ఐటీఆర్ ఫైలింగ్ చేయడం మంచిదని పన్ను నిపుణులు సూచిస్తున్నారు.

Related posts

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ..

Drukpadam

గుజరాత్ లోని ఓ గేమింగ్ జోన్ లో ఘోర అగ్నిప్రమాదం… 35 మంది మృతి..

Ram Narayana

కేరళలో పేలుళ్లు… సీఎం విజయన్ తో మాట్లాడిన అమిత్ షా

Ram Narayana

Leave a Comment