Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆంద్రప్రదేశ్ శాసన మండలి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే!

ఆంద్రప్రదేశ్ శాసన మండలి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే!
ఏపీలో నేడు ఖాళీ కానున్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు
గవర్నర్ కోటాలోని స్థానాలు ఖాళీ
నలుగురి పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్‌కు ఫైల్
రేపటిలోగా గవర్నర్ నుంచి ఆమోదం!
ఒక పక్క శాసనమండలి రద్దు చేయాలనీ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసినప్పటికీ అది కార్యరూపం ఇప్పట్లో దాల్చెట్లు లేదు… ఫలితంగా అధికార పార్టీ మండలితో బలం పెంచుకొనే పనిలో పడింది. సహజంగానే కొంత ఆలస్యం అయినప్పటికీ అధికార వైకాపా కు మెజార్టీ రావడం ఖాయం … రేపు గవర్నర్ కోటాలో భర్తీ కానున్న నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి ఫైల్ గవర్నర్ ఆమోదం కోసం పంపినట్లు తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గవర్నర్ కోటాలోని నాలుగు స్థానాలు నేడు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. భర్తీ అయ్యే స్థానాలను మోషేను రాజు (పశ్చిమ గోదావరి), లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), ఆర్వీ రమేశ్ యాదవ్ (కడప), తోట త్రిమూర్తులు (తూర్పు గోదావరి)తో భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. వీరి పేర్లను ప్రతిపాదిస్తూ ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్‌కు ఫైలు పంపినట్టు సమాచారం. నేడు, లేదంటే రేపటిలోగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

Related posts

కిరణ్ కుమార్ రెడ్డి చుట్టూ ఏపీ కాంగ్రెస్ రాజకీయాలు …

Drukpadam

కేసీఆర్ పర్యటనల కోసం ప్ర‌త్యేక విమానాన్ని కొనుగోలు చేయనున్న‌ టీఆర్ఎస్‌…!

Drukpadam

కేసును ఎదుర్కొనేందుకు నారా లోకేశ్ సిద్ధంగా ఉండాలి: మంత్రి కన్నబాబు!

Drukpadam

Leave a Comment