Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌..సీజేఐ గా మొదటిసారి పర్యటన…

తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌..సీజేఐ గా మొదటిసారి పర్యటన
-మహాద్వారం వద్ద అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం
– తిరుచానూరు పద్మావతి అమ్మవారినీ దర్శించుకోనున్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌
-మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌కు ప‌య‌నం
-సీజేఐగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత తొలిసారి నేడు తెలంగాణ‌కు.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ రమణ ఈరోజు ఉద‌యం వీఐపీ బ్రేక్‌ దర్శనంలో శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. అంత‌కు ముందు జ‌స్టిస్ ఎన్వీ రమణ దంపతులకు ఆలయ మహాద్వారం వద్ద అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఇత‌ర అధికారులు వారికి స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం జ‌స్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. కాగా, జస్టిస్‌ ఎన్వీ రమణ దంప‌తుల‌కు నిన్న రాత్రే తిరుమల చేరుకున్నారు. శ్రీవారి ఏకాంత సేవలోనూ పాల్గొన్నారు.

ఈ రోజు మ‌ధ్యాహ్నం జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ హైదరాబాద్‌కు రానున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం జ‌స్టిస్ ఎన్వీ రమణ తొలిసారి రాష్ట్రానికి వ‌స్తుండ‌డంతో ఆయ‌న‌కు ఘ‌న‌ స్వాగ‌తం ప‌లికేందుకు తెలంగాణ స‌ర్కారు ఏర్పాట్లు చేసింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎన్వీ రమణకు మంత్రి కేటీఆర్ స్వాగతం పలకనున్నారు. మూడు రోజుల పాటు రాజ్‌భవన్ అతిథి గృహంలో జస్టిస్‌ ఎన్వీ రమణ బస చేస్తారు. ప్ర‌జ‌ల నుంచి విజ్ఞ‌ప్తులూ స్వీక‌రించే అవ‌కాశం ఉంది.

Related posts

ఇండోనేషియాలో విరుచుకుపడిన భూకంపాలు.. 162కి పెరిగిన మృతుల సంఖ్య!

Drukpadam

హత్య చేసిన వారెవరైనా వదిలిపెట్టం:మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్!

Drukpadam

అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అతి తీవ్ర తుపాను

Drukpadam

Leave a Comment