Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమెరికా వెళ్లాలనుకునే వారికి ఈ కోచింగ్ సెంటర్ మంచి శిక్షణ ఇస్తుంది: కేంద్రమంత్రి పెమ్మసాని

  • గుంటూరులో ఫాంగ్ టెక్ ల్యాబ్ ఐటీ ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి
  • సరైన గైడెన్స్ లేక అమెరికాలో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారని వ్యాఖ్య
  • అలాంటి వారికి ఈ సెంటర్ ఉపయోగకరమన్న కేంద్రమంత్రి

అమెరికా వెళ్లాలనుకునే యువతకు ఐటీ రంగంలో మరింత నైపుణ్యంతో కూడిన కోచింగ్‌ను అందించేందుకు ఫాంగ్ టెక్ ల్యాబ్ ఐటీ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఈరోజు ఆయన గుంటూరులో ఈ ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… అమెరికా వెళ్లాలనుకునే యువత కోసం ఇలాంటి కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

ఇక్కడి నుంచి వెళ్లే సమయంలో సరైన గైడెన్స్ లేక అమెరికా వెళ్లిన విద్యార్థులు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇటువంటి సంస్థలో శిక్షణ తీసుకొని వెళితే అమెరికాలో ఇబ్బందులు తప్పుతాయన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ… అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్రులు తిరిగి వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.

Related posts

మాట…మర్మం

Drukpadam

మీ చుట్టూ తిరిగినప్పుడు ఎక్కడికి పోయారు మీరు?: సజ్జలను ప్రశ్నించిన బొప్పరాజు

Drukpadam

కరోనా వేళ వృద్ధుడి ప్రాణాలు కాపాడేందుకు ఎస్ ఐ సాహసం!

Drukpadam

Leave a Comment