Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

జిమ్ లో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్!

  • జిమ్ లో కసరత్తులు చేస్తుండగా గాయం
  • బెణికిన ఎడమ మణికట్టు
  • చేతికి బ్యాండేజ్ తో దర్శనమిచ్చిన ఎన్టీఆర్
  • గాయంతో బాధపడుతూనే దేవర షూటింగ్ పూర్తి

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎడమచేతికి గాయమైంది. జిమ్ లో కసరత్తులు చేస్తుండగా ఎన్టీఆర్ ఎడమ మణికట్టు బెణికింది. అయితే, గాయం బాధిస్తున్నప్పటికీ ఎన్టీఆర్ దేవర పార్ట్-1 షూటింగ్ లో పాల్గొని, తన పార్ట్ ను కంప్లీట్ చేశారు. దీనిపై ఎన్టీఆర్ టీమ్ నుంచి ప్రకటన వెలువడింది. 

ఎన్టీఆర్ రెండ్రోజుల కిందట జిమ్ లో వర్కౌట్లు చేస్తూ గాయపడ్డాడని ఆ ప్రకటనలో తెలిపారు. గాయంతో బాధపడుతూనే దేవర షూటింగ్ పూర్తి చేశారని, గాయం మరింత తీవ్రం కాకుండా ఎన్టీఆర్ చేతికి బ్యాండేజ్ (తొడుగు) వేసుకున్నారని వివరించారు. 

ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, మరో రెండు వారాల పాటు చేతికి బ్యాండేజ్ ఉంటుందని వెల్లడించారు. ఎన్టీఆర్ త్వరలోనే మళ్లీ సినిమా పనులతో బిజీ అవుతారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

ఇది స్వల్ప గాయమేనని, దీనిపై లేనిపోనివి ప్రచారం చేయొద్దని ఎన్టీఆర్ టీమ్ విజ్ఞప్తి చేసింది.

Related posts

సంక్రాంతికి సొంతూళ్లకు హైదరాబాద్‌వాసుల పయనం… టోల్‌గేట్ల వద్ద రద్దీ

Ram Narayana

తెలంగాణాలో మండలి ఉనికికి ప్రమాదం …సీఎంల భేటీలో చర్చించండి …మాజీఎంపీ వినోద్

Ram Narayana

ఏపీకి కదిలిన ఓటర్లు.. కిక్కిరిసిన హైదరాబాద్‌-విజయవాడ హైవే!

Ram Narayana

Leave a Comment