Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

పాలేరు ఎడమ కాలువ నీటి విడుదలను పరిశీలించిన మంత్రి పొంగులేటి!

మంగళవారం మంత్రి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ బాబు లతో కలిసి కూసుమంచి మండలం హట్యాతండాలో పాలేరు ఎడమ కాల్వ నీటి విడుదలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 150 మీటర్ల క్రింద పెద్ద గండి పడిందని యుద్ధ ప్రాతిపదికన గండి పూడ్చామని, క్రింద ఉన్న యూటి వాల్ నీటిలో ఉండటం వల్ల డ్యామేజ్ కావడం, దీనిని అధికారులు గ్రహించలేని కారణంగా నీటి విడుదల చేస్తే యూటి కూలిపోవడం జరిగిందని అన్నారు.

ఫలితంగా దిగువున ఉన్న రైతులకు సాగునీటి సరఫరా రెండు మూడు రోజులు ఆలస్యమైందని, యుద్ధ ప్రాతిపదికన గత 2 రోజుల నుంచి అధికార యంత్రాంగం ఇక్కడే ఉండి మరమ్మతు పనులు చేశారని మంత్రి తెలిపారు. మంగళవారం ఉదయం 500 క్యూసెక్కుల నుంచి మొదలు పెట్టి పెంచుకుంటూ మధ్యాహ్నం 1500 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నామని అన్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు పూర్తి స్థాయిలో 3200 క్యూసెక్కుల నీటి విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందిస్తామని అన్నారు.

దేవుడి దయ వల్ల కృష్ణా పరివాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు పడ్డాయని, 2 పంటలకు సరిపడా సాగునీరు ప్రాజెక్టులలో ఉందని, ప్రభుత్వం చిత్తశుద్ధితో 2 పంటలకు నీళ్లు విడుదల చేస్తుందని అన్నారు. వరదల వల్ల వచ్చిన ఉపద్రవంతో ఆశించిన దాని కంటే రెండు, మూడు రోజులు సాగునీరు అందించడం ఆలస్యమైందని, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇర్రిగేషన్ సిఇ విద్యాసాగర్, ఎస్ఇ నర్సింగ రావు, ఇఇ లు వెంకటేశ్వర రావు, అనన్య, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

వరదలను జాతీయ విపత్తుగా గుర్తించాలి. కూనంనేని

Ram Narayana

ఖమ్మం కాంగ్రెస్ లో లొల్లి …ముగ్గురు మంత్రుల సమక్షంలోనే వాదులాట

Ram Narayana

పాలేరులో కందాల వ్యూహాత్మక ప్రచారం …

Ram Narayana

Leave a Comment