Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

కన్నతల్లిని చెట్టుకు కట్టేసి, సజీవ దహనం చేసిన కొడుకులు!

  • కన్నతల్లి పట్ల ఇద్దరు కొడుకుల కర్కశత్వం
  • త్రిపురలో వెలుగుచూసిన అమానుష ఘటన
  • కుటుంబ కలహాలే కారణమంటున్న పోలీసులు

త్రిపురలో అమానుష ఘటన వెలుగుచూసింది. ఖమర్‌బరిలో ఓ 62 ఏళ్ల మహిళను ఆమె కొడుకులు ఒక చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేశారు. కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు కొడుకులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నామని, కుటుంబ కలహాలే ఈ దారుణ హత్యకు దారితీశాయని అనుమానిస్తున్నట్టు పేర్కొన్నారు. చంపక్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమర్‌బారిలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగిందని వివరించారు.

ఒక మహిళను కాల్చివేశారనే సమాచారం అందిన వెంటనే పోలీసు బృందం అక్కడికి వెళ్లిందని, చెట్టుకు కట్టేసి కాల్చిన మృతదేహాన్ని గుర్తించామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించామని జిరానియా సబ్-డివిజనల్ పోలీసు అధికారి కమల్ పేర్కొన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరచనున్నామని చెప్పారు. విచారణలో మరిన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు.

Related posts

సోను సూద్ పై ఐటీ దాడులు….

Drukpadam

మహబూబాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ రవినాయక్ దారుణ హత్య!

Drukpadam

పంజాబ్ లో ఉద్రిక్త‌త‌లు.. మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్‌ సేవల నిలిపివేత‌!

Drukpadam

Leave a Comment