- తిరుపతి లడ్డూ కల్తీ, సనాతన ధర్మం అంశాల్లో ప్రకాశ్ రాజ్ విమర్శలు
- జనసేనానిని టార్గెట్ చేస్తూ ట్వీట్లు
- ఇటీవల అన్నాడీఎంకే 53 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పవన్ ట్వీట్
- పైనుంచి ఆదేశాలు అందాయా అంటూ స్పందించిన ప్రకాశ్ రాజ్
తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం, సనాతన ధర్మం అంశాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై నటుడు ప్రకాశ్ రాజ్ గత కొన్ని రోజులుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ అన్నాడీఎంకే 53వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎంజీఆర్ ను ప్రస్తావిస్తూ ట్వీట్ చేయగా… ఆ ట్వీట్ పై ప్రకాశ్ రాజ్ స్పందించారు.
“ఎంజీఆర్ పై హఠాత్తుగా ఎందుకింత ప్రేమో!… పైనుంచి ఆదేశాలు అందాయా?” అంటూ పవన్ కల్యాణ్ కు చురక అంటించారు. అంతకుముందు, మరో ట్వీట్ లో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోను కూడా ప్రకాశ్ రాజ్ పంచుకున్నారు.