Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

మంత్రులకు శంఖుస్థాపనలపై ఉన్న శ్రద్ద …వరద భాదితులను ఆదుకోవడంలో లేదు …

వరదల్లో నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని, చాలా మందికి బ్యాంకులలో ఇంకా డబ్బులు పడని వారికి వెంటనే వారి ఖాతాలో డబ్బులు జమ చేయాలని సిపిఎం 3 టౌన్‌ కమిటి ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం పలువురు వక్తలు డిమాండ్ చేశారు .. వరదల వల్ల నష్టం అపారంగా జరిగింది …ప్రభుత్వం చేసిన సహాయం కోసరంతా , వరద నష్టాలను కళ్లారా చుసిన మంత్రులు ,ముఖ్యమంత్రి సహాయం చేస్తామని వాగ్దానం చేశారు …మీకు మేము అండగా ఉంటామని అన్నారు …కంటితుడుపు చర్యలు సహాయం చేశారు … ఇప్పటికి ప్రభుత్వం వేస్తానన్న రూ 16500 లు అందరి అకౌంట్ లలో పడలేదు …సహాయం కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి చెప్పులు తిరుగుతున్నాయి తప్ప సహాయం అందడంలేదని భాదితులు ఆగ్రహంతో ఉన్నారని వక్తలు పేర్కొన్నారు … ఈ సమావేశంలో సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎం.ఎల్‌) మాస్‌ లైన్‌, టిఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు యర్రా శ్రీకాంత్‌ అధ్యక్షత వహించారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు ఆర్‌జెసి కృష్ణ, సిపిఐ(ఎం.ఎల్‌) మాస్‌ లైన్‌ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు, సిపిఐ జిల్లా నాయకులు నూనె శశిధర్‌ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు శంకుస్థాపనలకు ఇచ్చే ప్రాముఖ్యత వరదల్లో నష్టపోయిన ప్రజలకి నష్ట పరిహారం ఇప్పించుటలో చొరవ చూపించడం లేదని అన్నారు. జిల్లా ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ మీద ఎంతో నమ్మకంతో గెలిపిస్తే కాంగ్రెస్‌ నాయకులు, మంత్రులు ప్రజలను పట్టించుకునే స్థితి లేదని విమర్శించారు. వరదల్లో నష్టపోయిన వారికి నష్ట పరిహారం రు.16,500/` కే పరిమితం చేసి కొంత మందికే డబ్బులు బ్యాంకుల్లో జమ చేశారు. మిగిలిన వారికి ఇంకా బ్యాంకుల్లో జమ కాలేదన్నారు. నష్ట పరిహారం జమ కానివాళ్ళు మున్సిపల్‌ అధికారులు దగ్గరికి పోయి నష్ట పరిహారం చెల్లించాలని బాధితులు అడిగినా, మున్సిపల్‌ అధికారులు పట్టించుకునే స్థితి లేదన్నారు. అందుకోసం దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఈ నెల 16వ తారీఖున ఎమ్మార్వో కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని, అట్లాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం పెంచాలని జరిగే ధర్నాలో పాల్గొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు వై.విక్రమ్‌, యర్రా శ్రీనివాసరావు, ఎం.ఎల్‌.మాస్‌ లైన్‌ నాయకురాలు రaాన్సీ, సిపిఐ నాయకులు వీరభద్రం, కార్పోరేటర్లు ఎల్లంపల్లి వెంకటరావు, రుద్రగాని ఉపేందర్‌, తోట ఉపేందర్‌, ప్రసన్న, మాటేటి నాగేశ్వరరావు, సిపిఎం 3 కార్యదర్శి భూక్యా శ్రీనివాసరావు, వజినేపల్లి శ్రీనివాసరావు, ఎస్‌.కే.బాబు, రంగు హనుమంతాచారి, మహిళా సంఘం నాయకురాలు అమీనా, రాజు, సిపిఎం జిల్లా నాయకులు నవీన్‌ రెడ్డి, సుదర్శన్‌, రబ్బాని, పాపారావు తదితరులు పాల్గొన్నారు…

Related posts

తుమ్మలను పట్టించుకోని బీఆర్ యస్ …ఆయన చూపు ఎటు వైపు …?

Ram Narayana

తుమ్మల,బాలసానిని మర్యాద పూర్వకంగా కలిసిన భద్రాచలం కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య

Ram Narayana

పాలేరులో అన్నకోసం తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి విస్తృత పర్యటనలు…!

Ram Narayana

Leave a Comment