Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
హైద్రాబాద్ వార్తలు

చెరువుల పునరుజ్జీవం కోసం హైడ్రా చర్యలు తీసుకుంటోంది: హైడ్రా కమిషనర్ రంగనాథ్

  • పర్యావరణ పరిరక్షణకు చెరువు తల్లి వంటిదన్న రంగనాథ్
  • పట్టణీకరణతో చెరువులు ప్రభావాన్ని కోల్పోయాయన్న హైడ్రా కమిషనర్
  • బెంగళూరులో చెరువుల పునరుద్ధరణను రంగనాథ్‌కు వివరించిన లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా

చెరువుల పునరుజ్జీవం కోసం హైడ్రా అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే చెరువులకు పునరుజ్జీవం కల్పిస్తామని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు చెరువు తల్లి వంటిది అన్నారు. తాగు, సాగు నీరు అందించే చెరువులు… ప‌ట్ట‌ణీక‌ర‌ణతో ప్రాభవాన్ని కోల్పోయాయన్నారు. ఎన్నో చెరువులు కనుమరుగయ్యాయని, మిగిలి ఉన్న చెరువులు కూడా మురికి కూపాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లోని హైడ్రా కార్యాలయంలో ‘లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ ఆనంద్ మల్లిగవాడ్‌తో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ… చెరువుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప‌రిస‌ర ప్రాంతాల్లో నివ‌సిస్తున్న కాల‌నీ, బ‌స్తీ వాసులు, స్వ‌చ్ఛంద‌, కార్పొరేట్ సంస్థ‌లు, ప్ర‌భుత్వ విభాగాలను భాగ‌స్వామ్యం చేసి చెరువులను పునరుద్ధరిస్తామన్నారు.

ఇదిలా ఉండగా, బెంగళూరులో మురుగుతో… నీళ్లు లేకుండా ఉన్న వాటిని ఎలా మంచి చెరువులుగా మార్చారో ఆనంద్ మల్లిగవాడ్… రంగనాథ్‌కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బెంగళూరులో 35 చెరువులను పునరుద్ధరించిన విధానాన్ని వివరించారు. తక్కువ వ్యయంతో బెంగళూరులో చెరువులకు పునరుజ్జీవం కల్పించినట్లు చెప్పారు.

Related posts

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం… ఇద్దరు ఏపీ యువకుల మృతి

Ram Narayana

హైడ్రా తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు!

Ram Narayana

ఇప్పటిదాకా కూల్చివేసిన నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వానికి ‘హైడ్రా’ నివేదిక..!

Ram Narayana

Leave a Comment