Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

ఈ నెల 19 నుంచి జనవరి నెల శ్రీవారి దర్శనం, సేవల టికెట్ల జారీ!

  • జనవరి నెల కోటా శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
  • 19 నుంచి 23వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దర్శన టికెట్ల బుకింగ్‌కు అవకాశం
  • లక్కీ డిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపు

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి 2025 జనవరి నెల కోటాను ఈ నెల 19న (ఎల్లుండి) ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అక్టోబర్ 21వ తేదీ ఉదయం పది గంటల వరకూ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో ఈ టికెట్లను కేటాయిస్తారు. టికెట్లు పొందినవారు అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ ఉదయం పది గంటల లోగా సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.

ఇక కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను అక్టోబర్ 22న ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించి జనవరి నెల కోటాను కూడా టీటీడీ విడుదల చేయనుంది. 

అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబర్ 23న ఉదయం పది గంటలకు విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించి ఆన్‌లైన్ కోటాను అక్టోబర్ 23న ఉదయం 11 గంటలకు టీటీడీ అందుబాటులోకి తీసుకొస్తుంది. వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జనవరి నెలలో ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను అక్టోబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది.

Related posts

కేంద్రం వరద సాయం… ఏపీకి రూ.1,036 కోట్లు, తెలంగాణకు రూ.416 కోట్లు విడుదల!

Ram Narayana

భద్రాచలం వద్ద ఐదు ఊళ్ళు ఇవ్వాలని ప్రధానిని కోరాం…డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

చంద్రబాబుకు కేటీఆర్ ప్రశంస …తపన ఉన్న నాయకుడని కితాబు..!

Ram Narayana

Leave a Comment